దిల్ రాజ్ ఆంతర్యాన్ని గమనిస్తున్న పవన్ అభిమానులు !

Seetha Sailaja

పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలి అన్నది దిల్ రాజ్ చిరకాల డ్రీమ్. ఇప్పుడు ఆ కల దిల్ రాజ్ ను కన్ఫ్యూజ్ లో పడేసిందా అన్న అనుమానాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. నిజానికి ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ రెండవ వారానికి పూర్తి అయిపోయి డిసెంబర్ నెలాఖరుకు ఈమూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడ పూర్తి అయిపోతాయి.


అయితే ఇంత జరుగుతున్నా దిల్ రాజ్ ఏమాత్రం హ్యాపీ గా లేడు అన్న మాటలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఈ మూవీ బడ్జెట్ పవన్ పారితోషికంతో కలిపి 80 కోట్లకుచేరుకున్నట్లు టాక్. ఈ మూవీకి బోనికపూర్ సహ నిర్మాత అయినప్పటికీ దిల్ రాజ్ పైనే ఎక్కువ ఆర్ధికభారం పడినట్లు లీకులు వస్తున్నాయి.


ఈ పరిస్థితులలో ఈ మూవీ మార్కెట్ 100 కోట్ల వరకు జరిగినప్పుడు మాత్రమే వడ్డీలు పోయి దిల్ రాజ్ కు లాభాలు వస్తాయి. అయితే ఇప్పటికి వచ్చి ధియేటర్లు తెరుచుకోకపోవడంతో పాటు పవన్ రీ ఎంట్రీ మూవీకి జనం రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియని పరిస్థితులలో బయ్యర్లు ‘వకీల్ సాబ్’ పై ఆచితూచి వ్యవహరిస్తూ ఉండటంతో ఈ మూవీ బిజినెస్ దిల్ రాజ్ ఊహించిన స్థాయిలో లేదు అంటున్నారు.


ఈ విషయాలు ప్రస్తుతం దిల్ రాజ్ కు టెన్షన్ కలిగిస్తున్నా తన టెన్షన్ ను బయటపడనీయకుండా తన సహజ సిద్ధమైన స్వీట్ స్మైల్ చేస్తూ ఎవరైనా తాను ఖర్చుపెట్టిన ఖర్చుకు 10 కోట్లు అదనంగా ఇస్తే ‘వకీల్ సాబ్’ టోటల్ రైట్స్ ఇచ్చేసే బంపర్ ఆఫర్ తన వద్ద ఉంది అంటూ కొంతమంది దగ్గర జోక్స్ వేస్తున్నట్లు టాక్. దీనితో ‘వకీల్ సాబ్’ ఫైనల్ అవుట్ పుట్ పై దిల్ రాజ్ కు నమ్మకం తగ్గిందా లేదంటే ఈ మూవీని ఎప్పుడు విడుదల చేయాలో తెలియక దిల్ రాజ్ కన్ఫ్యూజ్ అవుతున్నాడా అంటూ ఇండస్ట్రీ వర్గాలతో పాటు పవన్ అభిమానులు కూడ దిల్ రాజ్ మాటలలోని ఆంతర్యాన్ని గమనిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: