బాలయ్య సినిమాలో మళ్ళీ మార్పులు.. ఏకంగా పాత్ర లేపేశారట !
గతంలో ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు అని గట్టిగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో రెండో పాత్రను పూర్తిగా తీసేశారని అంటున్నారు. దాన్ని బట్టి మరో హీరోయిన్ గా తీసుకునే అవకాశం కూడా లేకుండా చేశాడు అని అంటున్నారు. ముందు నుంచి ఈ సినిమాలో బాలకృష్ణ ఒక అఘోరా పాత్రలో నటిస్తున్నాడని వారణాసి బ్యాక్ డ్రాప్ లో కొంత భాగం షూటింగ్ కూడా బాకీ ఉందని ప్రచారం జరిగింది,
తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ పాత్రని బోయపాటి సినిమా నుండి తప్పించాడు అని అంటున్నారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని ప్రస్తుతానికి bb3 అని సంభోదిస్తున్నారు. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయం మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు. చూడాలి మరి ఈ సినిమాలో ఇంకెన్ని మార్పులు చేర్పులతో తేరకేక్కుతుందో ?