విష్ణు - శ్రీను వైట్ల ల 'ఢీ - 2' అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!
జెనీలియా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల నటన, ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో పాటు బ్రహ్మానందం పండించిన కామెడీ ప్రధాన హైలైట్స్ గా నిలిచాయి. ఇకపోతే అసలు మ్యాటర్ ఏమిటంటే, 13 ఏళ్ల తరువాత ప్రస్తుతం ఢీ సినిమాకి సీక్వెల్ గా ఢీ 2 చేయడానికి సిద్ధమయ్యారు విష్ణు, శ్రీను వైట్ల. నేడు విష్ణు జన్మదినం సందర్భంగా ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేసింది మూవీ యూనిట్. విష్ణు సొంత సంస్థ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి గోపిమోహన్ కథ, స్క్రీన్ ప్లే సహకారం అందిస్తుండగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ సంగీతాన్ని అలానే ప్రముఖ ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ పోరాటాలు అందించనున్నారు.
డిడి, డబుల్ డోస్ పేరుతో అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాని మొదటి భాగాన్ని మించేంతగా ఎంటర్టైన్మెంట్ తో పాటు ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో తెరకెక్కించనున్నట్లు టాక్. మరోవైపు ఈ సినిమాలో నటించబోయే హీరోయిన్ తో పాటు పలు ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతున్నట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు తో దూకుడు, ఆ తరువాత ఎన్టీఆర్ తో తీసిన బాద్షా సినిమాల తరువాత శ్రీనువైట్లకు కెరీర్ పరంగా ఇప్పటివరకు సరైన సక్సెస్ లేకపోవడంతో ఆయన ఈ సినిమాతో ఎలాగైనా భారీ విజయాన్ని అందుకునేందుకు పక్కాగా సిద్దమవుతున్నట్లు టాక్. భారీ ఖర్చుతో, పలు కమర్షియల్ హంగులతో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు అతి త్వరలో వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది....!!