సమంత మాల్దీవుల్లో చేసిన ఆ పని నమ్మలేకపోతున్న అఖిల్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సమంత సోషల్ మీడియాలో ఎప్పుడు చాలా  యాక్టివ్‌గా ఉంటూ ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు తన, తన ఫ్యామిలీ అప్‌డేట్స్ గురించి ముచ్చటిస్తూ మంచి మంచి పోస్టులు  పోస్ట్ చేస్తూ ఉంటుంది .. ఇక తాజాగా మాల్దీవ్స్ వెళ్లిన సమంత అక్కడ మాల్దీవ్ బీచుల్లో సరదాగా ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను అభిమానులతో పంచుకుంది. భర్త నాగచైతన్యతో కలిసి విదేశాలు చుట్టి రావడమంటే సమంతకు చాలా  ఇష్టం. అందుకే  నాగచైతన్య పుట్టిన రోజు వేడుకను  జరుపుకునేందుకు  భర్తతో కలసి మాల్దీవ్ వెళ్లింది సమంత. అక్కడి బీచ్, అందమైన ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తోంది ఈ అందమైన జంట.


ఈ రోజు  యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య పుట్టినరోజు. ఈ సందర్భంగా మాల్దీవ్ ట్రిప్ కి వెళ్లిన  సమంత.. భర్తతో హ్యాపీ గా గడుపుతూ రిలాక్స్ అవుతోంది. ఇందుకు సంబంధించి కొన్ని ఫోటోలను సామ్ తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. మాల్దీవుల్లోని ఉత్తరాదిన ఉన్న ఓ ద్వీపంలో ఈ అక్కినేని దంపతులు ఉన్నట్లు సమాచారం. అయితే అక్కడ స్కూబా డైవింగ్‌ చేస్తూ దిగిన ఓ పిక్ షేర్ చేసిన సమంత.. ''మొత్తానికి సాధించా, సముద్రంలో డైవ్ చేశా..'' అంటూ ఎక్సయిట్ అయింది. ఇది చూసిన అక్కినేని అఖిల్.. ''వావ్.. ఆశ్చర్యంగా ఉంది. నేను నమ్మలేకపోతున్నా'' అని కామెంట్ పెట్టడం అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటోంది.



ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా, అక్కినేని కోడలిగా వెండితెరపై సత్తా చాటుతున్న ఆమె చివరగా 'జాను' సినిమాలో మెరిసింది. ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారం అయ్యే 'ఫ్యామిలీ మ్యాన్' అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఆహా వేదికపై ప్రసారమవుతున్న 'సామ్ జామ్' ప్రోగ్రాంని హోస్ట్ చేస్తోంది. ఇక ఆమె తదుపరి సినిమా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందనుందని, ఇందులో తన భర్త నాగ చైతన్యతో సామ్ మరోసారి తెరపంచుకోనుందని తెలుస్తోంది.ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి...


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: