ఒకే సినిమాలో ఇద్దరు పవర్ స్టార్లు.. పవన్ డ్యుయల్ రోల్ అంటే బాక్సులు బద్ధలే..!

shami
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత క్రిష్ డైరక్షన్ లో పవన్ సినిమా ఉంటుందని తెలిసిందే. పవన్ కెరియర్ లో ఇప్పటివరకు చేయని కథతో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత గబ్బర్ సింగ్ డైరక్టర్ హరీష్ శంకర్ తో పవర్ స్టార్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు.
క్రిష్ సినిమా పూర్తి కాగానే హరీష్ శంకర్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. అయితే హరీష్ శంకర్ సినిమాలో పవర్ స్టార్ ఒక పాత్రలో కాదు రెండు పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ వన్ మ్యాన్ షో అయితేనే సినిమా రికార్డులు కొడుతుంది అలాంటిది ఇద్దరు పవర్ స్టార్లు ఉంటే ఆ లెక్క వేరేలా ఉంటుంది. పవర్ స్టార్ తీన్ మార్ సినిమాలో ఈ ప్రయోగం చేశారు. అయితే అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.
అయితే హరీష్ శంకర్ డైరక్షన్ లో సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ డ్యుయల్ రోల్ చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో పవర్ స్టార్ ఒక పాత్రలో పోలీస్ గా నటిస్తాడని టాక్. పవర్ స్టార్ కు బీభత్సమైన ఫ్యాన్ అయిన హరీష్ శంకర్ పఫ్వర్ స్టార్ తో రెండో సినిమా అది కూడా ఇద్దరు పవన్ కళ్యాణ్ ల కథతో వస్తున్నాడు అంటే కచ్చితంగా సినిమా రికార్డులు బద్ధలు కొడుతుందని చెప్పొచ్చు.                                                                         
  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: