వెంకటేష్ ను పరోక్షంగా టార్గెట్ చేసిన తరుణ్ భాస్కర్ ?

Seetha Sailaja
క్రియేటివ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తీసినవి రెండే రెండు సినిమాలు అయినప్పటికీ యంగ్ డైరెక్టర్స్ లిస్టులో అతడికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. గత సంవత్సరం వెంకటేష్ తో ఇతడి మూవీ ప్రాజెక్ట్ ఉంటుంది అంటూ వార్తలు వచ్చాయి. గుర్రపు పందాల నేపధ్యంలో జరిగే ఈ మూవీ కథ కోసం తరుణ్ భాస్కర్ గుర్రపు పందాల మాఫియా పై చాల లోతుగా పరిశీలించి ఈ మూవీ కథను తయారు చేసాడు.

ఈ మూవీ కథ వెంకటేష్ కు కూడ నచ్చడంతో వెంకీ కెరియర్ లో వచ్చే 75వ సినిమాగా ఈ మూవీ రూపొందింప బడుతుందని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో కాని వెంకీ తన ఆలోచనలు మార్చుకోవడంతో ఈ మూవీ ప్రాజెక్ట్ అటకెక్కింది. దీనితో షాక్ అయిన తరుణ్ భాస్కర్ తన కథ కోసం మరో హీరో అన్వేషణలో తన కాలం కొనసాగిస్తున్నాడు.

ఇలాంటి పరిస్థితులలో తరుణ్ భాస్కర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో చేసిన లేటెస్ట్ కామెంట్స్ పై ఇండస్ట్రీ వర్గాలలో ఆశక్తికర చర్చలు జరుగుతున్నాయి.  వెంకటేష్ పేరు బయట పడకుండా ఈ కామెంట్స్ చేసాడు. నా 3వ మూవీ ప్రాజెక్ట్ అంతా ఫైనల్ అయి ఆగిపోవడంతో ‘నా మైండ్ బ్లాంక్ అయింది. ఆ భాద ఇంచుమించు మానసికంగా చంపేసింది. అయితే ఆ షాక్ నుండి తేరుకుని మరో రెండు పవర్ ఫుల్ సబ్జెక్ట్స్ సిద్ధం చేసి మరో సినిమాకు రెడీ అవుతున్నాను’ అంటూ తన ఆవేదన వ్యక్త పరిచాడు.

అంతేకాదు ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రూపొందబోయే ఈ మూవీ ప్రాజెక్ట్ లో తనకు బాగా సన్నిహితుడైన ఒక ప్రముఖ హీరో నటించబోతున్నట్లు తెలియ చేసాడు. దీనితో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో ఆ హీరో ఎవరు అంటూ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. మరి ఆ హీరో తరుణ్ భాస్కర్ తన పై పెట్టుకున్న ఆశలను చివరివరకు నిలబెట్టుకుంటాడా లేదా అన్న విషయం రానున్న రోజులలో తేలనున్నది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: