బిగ్ బాస్ 4 : ఆ ఇద్దరూ ఫైనల్లో ఉంటే చూడాలని ఉందంటున్న నాగబాబు..?

praveen
ప్రస్తుతం బిగ్ బాస్ షో బుల్లితెర ప్రేక్షకులకు తెగ ఆకర్షిస్తూ దూసుకు పోతుంది అన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ మన్మధుడు నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించే  ఈ షో ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకుల చూపును తనవైపు తిప్పుకుంది. ఇక రోజురోజుకు బిగ్ బాస్ షో మరింత రసవత్తరంగా మారుతుంది అనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రస్తుతం బిగ్ బాస్ ఫైనల్ అంకానికి చేరుకుంటున్న  తరుణంలో ఎప్పుడు ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది కూడా ప్రస్తుతం ప్రేక్షకుల ఊహకందని విధంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ లో ఎవరు విజేతగా నిలవ పోతున్నారూ అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తి కరం గా మారిపోయింది.

 కాగా బిగ్ బాస్  సీజన్ 4 లో ఎవరు విజేతగా నిలుస్తారు అన్న దానిపై ప్రస్తుతం ఎంతో మంది సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ తన అభిప్రాయాలను పంచుకుంటున్నారు అనే విషయం తెలిసిందే.  అంతే కాకుండా తమ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అన్నదానిపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబు బిగ్ బాస్ 4 సీజన్ లో తనకు ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు అన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్ లో తనకు అవినాష్ అభిజిత్ ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు మెగాబ్రదర్ నాగబాబు.

 అవినాష్ అభిజిత్ ఫైనల్లో ఉంటే  చూడాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు. జబర్దస్త్ ద్వారా ఎన్నో ఏళ్ల నుంచి తెలుసు కాబట్టి అవినాష్ అంటే తనకు ఇష్టమని అందుకే అవినాష్ ఫైనల్లో ఉండాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చిన మెగా బ్రదర్ నాగబాబు ఇక బిగ్ బాస్ హౌస్ లో ఆట పరంగా అభిజిత్ అంటే ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ఇద్దరు ఫైనల్లో ఉండాలని ఎంతగానో కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు మెగా బ్రదర్ నాగబాబు. అయితే ఆట పరంగా అయితే అభిజిత్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ నాగబాబు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: