అక్కడ దీపికా.. ఇక్కడ త్రిష.. ఊపేయడం ఖాయం..!
పీకూ సినిమాలో దీపికా పదుకొనె నటించింది. సినిమాలో అమితాబ్ కూడా నటించాడు. అయితే తెలుగులో ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించాలని అనుకున్నారు. వెంకటేష్ నిహారికతో ఈ సినిమా చేయాలని చూశారు కాని ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. ఫైనల్ గా త్రిషతో ఈ రీమేక్ ఫిక్స్ చేశారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ఆఫర్ వచ్చినా సరే ఏవో కారణాల వల్ల చేయనని చెప్పింది త్రిష. ఫైనల్ గా ఇప్పుడు మరో సూపర్ హిట్ రీమేక్ తో రాబోతుంది అమ్మడు.
తెలుగులో చిరు ఆఫర్ కాదన్నా మాస్ మహరాజ్ రవితేజతో వినాయక్ చేసే సినిమాలో ఆమె నటిస్తుందని అన్నారు. అయితే ఆ సినిమా గురించి అఫీషియల్ న్యూస్ బయటకు రాలేదు. ఇక లేటెస్ట్ గా త్రిష పీకూ రీమేక్ లో నటించడం ఆమె ఫ్యాన్స్ కు సర్ ప్రైజింగ్ గా అనిపిస్తుంది. తెలుగులో కూడా ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తుండటంతో ఇక్కడ ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషిగా ఉన్నారు.