సంచలన నిర్ణయం తీసుకున్న నాగార్జున..?
రాజు గారి గది2 సినిమా పర్వాలేదనిపించుకున్నా ఆఫీసర్, దేవదాస్ సినిమాలు నాగ్ కెరీర్ లో మచ్చలుగా మిగిలిపోయాయి. దాంతో ఏరికోరి మరీ వైల్డ్ డాగ్ సినిమా చేస్తున్నారు.. వెరైటీ సినిమాలు చేయడం ఒక్క నాగార్జున కె సాధ్యం.. అన్నమయ్య లాంటి సినిమాలు చేయాలన్నా, హీరోయిన్ లేని గగనం లాంటి సినిమా చేయాలన్నా, సినిమా మొత్త కూర్చొని ఉండే ఊపిరి లాంటి సినిమా చేయాలన్నా నాగార్జున కె చెల్లింది. అలాంటి నాగార్జున తన కొత్త సినిమా వైల్డ్ డాగ్ విషయం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
టెర్రరిజం బ్యాక్ డ్రాప్ లో రూపొందిన వైల్డ్ డాగ్ లో నాగార్జున ఎన్ఐఏ ఆఫీసర్ గా నటిస్తున్నారు. బిగ్ బాస్ 3లో పాల్గొన్న అలీరెజాతో పాటు సయామీ ఖేర్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ఉండొచ్చనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. నెట్ ఫ్లిక్స్ ద్వారా ఇప్పటికే ఒప్పందం కూడా జరిగిందని అంటున్నారు.ఇక ఈ సినిమా తో పాటు నాగార్జున మరో రెండు సినిమాలను లైన్ లో పెట్టినట్లు తెలుస్తుంది. ఒకటి ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కాగా మరొకటి అనిల్ రావిపూడి తో సినిమా అంటున్నారు.