విక్రమ్ కుమార్ మౌనంలో అనీల్ రావిపూడి సందడి !
దీనితో ప్రస్తుతం విక్రమ్ కుమార్ వైపు ఇండస్ట్రీలోని హీరోలు పెద్దగా ఆశక్తి కనపరచడం లేదు. ఆమధ్య ఈ దర్శకుడు నాగచైతన్య తో ఒక సినిమా చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చినా ఆ వార్తల పై క్లారిటీ లేదు. ఇలాంటి పరిస్థితులలో ఈమధ్య సమంత ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మనం’ సీక్వెల్ పై ఆసక్తికర కామెంట్స్ చేసింది.
‘మనం’ సీక్వెల్ తీస్తే బాగుంటుంది అన్న అభిప్రాయం తనలో కూడ ఉందని అయితే డానికి తగ్గ కథ విక్రమ్ కుమార్ దగ్గర ఉందో లేదో అన్న విషయం తనకు తెలియదు అంటూ సీక్వెల్ అంటూ తీస్తే అక్కినేని హీరోలు అంతా నటిస్తారు అంటూ తన అభిప్రాయాన్ని తెలియచేసింది. ఆమె ఈ విధంగా కామెంట్స్ చేసిన కొద్ది రోజులకే అనీల్ రావిపూడిని నాగార్జున పిలిచి తనకు అఖిల్ కు సరిపోయే ఒక మల్టీ స్టారర్ మూవీ కథ ఏమైనా ఉందా అని తెలుసుకోవడమే కాకుండా స్క్రిప్ట్ ను బట్టి ఆమూవీలో నాగచైతన్య సమంతలు కూడ నటించే అవకాశం ఉంది అంటూ నాగ్ అనీల్ రావిపూడికి చెప్పినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
ఈ వార్తలే నిజం అయితే ‘మనం’ లాంటి మరో అక్కినేని ఫ్యామిలీ మూవీని తీసే బాధ్యత నాగ్ అనీల్ రావిపూడి కి అప్పచెప్పాడు అనుకోవాలి. ఇలాంటి పరిస్థితులలో నాగార్జున నుండి పిలుపు వస్తే ‘మనం’ మూవీకి సీక్వెల్ తీయాలి అని ఆశపడుతున్న విక్రమ్ కుమార్ ఆశలు గల్లంతు అయ్యాయి అనుకోవాలి..