అనిల్ రావి పూడి సమర్పిస్తున్న గాలి సంపత్ షూటింగ్ స్టార్ట్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...సూపర్ స్టార్ మహేష్ బాబుతో "సరిలేరు నీకెవ్వరూ" సినిమా తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు అనిల్ రావిపూడి...ఈ సినిమాతో పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోయాడు అనిల్.. మహేష్ తో సినిమా చేసినందుకు ఇతను స్టార్ డైరెక్టర్ గా కన్వెర్ట్ అయిపోయాడు. ఇప్పుడీ బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ నిర్మాతగా మారాడు. ఇక విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి సమర్పిస్తూ, స్క్రీన్ ప్లే అందిస్తున్న కొత్త సినిమా 'గాలి సంప‌త్'. అనిల్ కో డైరెక్ట‌ర్, రైట‌ర్, మిత్రుడు ఎస్. క్రిష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యంగ్ హీరో శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో న‌ట‌కిరీటి డా. రాజేంద్ర ‌ప్ర‌సాద్ గాలి సంప‌త్‌గా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. అనీష్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అరకులో జరుగుతోంది. రాజేంద్ర ప్రసాద్, హీరో శ్రీ విష్ణుతో పాటు సినిమాలో ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్ డిసెంబర్ 5 వరకు జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ షెడ్యూల్ ఉంటుంది. ఇప్పటికే విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేసింది.

ఇద్దరి తండ్రీ కొడుకుల మధ్య ముందెన్నడూ చూడని ఓ మంచి  డిఫరెంట్ కాన్సెప్ట్ తో అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్‌మెంట్ జోడించి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.ఈ చిత్రంలో రాజేంద్ర ప్ర‌సాద్‌, శ్రీ విష్ణు, ల‌వ్‌లీ సింగ్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, స‌త్య‌, ర‌ఘుబాబు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌, మిర్చి కిర‌ణ్‌, సురేంద్ర రెడ్డి, గ‌గ‌న్‌, మిమ్స్ మ‌ధు, అనీష్ కురువిల్లా, ర‌జిత‌, క‌రాటే క‌ళ్యాణి, సాయి శ్రీ‌నివాస్‌, రూపల‌క్ష్మి త‌దిత‌రులు నటిస్తున్నారు. అచ్చు రాజ‌మ‌ణి బాణీలు  అందిస్తున్నారు.
 షూటింగ్ తొందరగా ఫినిష్ చేసి విడుదల చేస్తామని అంటోంది చిత్రయూనిట్.ఇక అనిల్ మరోసారి తనను స్టార్ డైరెక్టర్ చేసిన సూపర్ స్టార్ మహేష్ కోసం ఓ పర్ఫెక్ట్ కథని సిద్ధం చేసుకొని త్వరలో సినిమా చెయ్యబోతున్నాడని సమాచారం అందుతుంది.ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో సినిమా సంగతులు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: