శృతి హాసన్ గొంతెమ్మ కోరికలు..తలపట్టుకుంటున్న వకీల్ సాబ్ యూనిట్
అయితే ఈ చక్కనమ్మకు రీఎంట్రీ ఇచ్చిన తర్వాత సైతం వరస పెట్టి ఆఫర్స్ కి లోటు లేకుండా పోయింది. తెలుగు తో పాటు తమిళ్ లో సైతం మంచి అవకాశాలను దక్కించుకుంటుంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి తో తమిళ్ లో ఒక సినిమా చేస్తుండగా, టాలీవుడ్ లో రవి తేజ పక్కన క్రాక్ మూవీలో సైతం ఛాన్స్ కొట్టేసింది. ఇక ఇప్పుడు గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ వకీల్ సాబ్ లో సైతం ఆమెనే ఎంచుకున్నారు చిత్ర యూనిట్.
వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ వంటి క్రేజ్ ఉన్న యాక్టర్ నటిస్తున్న కూడా శృతి హాసన్ ఈ సినిమా కోసం అనేక డిమాండ్స్ ని నిర్మాతల ముందు పెట్టిందట. తన పాత్ర సినిమాలో ఎంత తక్కువ ఉన్న హీరో తో సమానం గా రెమ్యునరేషన్ ఇవ్వాలని కోరిందట. నిజానికి ఈ సినిమాలో శృతి హాసన్ ది కేవలం అతిథి పాత్రేనట.
అయినప్పటికీ పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేస్తుండటం తో నిర్మాతలకు ముచ్చెమటలు పట్టాయట. ఇక ఇప్పటికే సీనియర్ హీరోలకు సరైన జోడీలు దొరకక ఇబ్బందులు పడుతున్న కారణంగా శృతి చెప్పిన అన్ని డిమాండ్స్ ని ఒప్పుకున్నారట చిత్ర యూనిట్. ఏది ఏమైనా ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత కూడా శృతి హాసన్ అదే రేంజ్ లో రెమ్యునరేషన్ మైంటైన్ చేయడం పట్ల ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ నడుస్తుంది.