జబర్దస్త్ లో 'మగధీర' స్కిట్.. కామెడీతో పొట్ట చెక్కలవ్వాల్సిందే!?

praveen
ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతి శుక్రవారం బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ ఉంటుంది. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో  కమెడియన్స్   ఎంతగానో ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కామెడీ షో లో టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ ఎక్స్ ట్రా  జబర్దస్త్ దూసుకుపోతోంది. ఇక ఈ వారం కూడా ఎక్స్ ట్రా  జబర్దస్త్ నిన్న ప్రసారమై బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది అనే విషయం తెలిసిందే. దీనికి  సంబంధించిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో విడుదల చేశారు.



 ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.  సాధారణంగానే ఎక్స్ ట్రా జబర్దస్త్ షో తో పాటు విడుదలైన ప్రోమో కూడా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ వారం కూడా విడుదలైన ప్రోమో కాస్త బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ స్కిట్ అయితే బుల్లితెర ప్రేక్షకులందరికీ పొట్ట చెక్కలయ్యేలా నవ్వించినది అని చెప్పాలి. సాధారణంగానే ప్రతివారం కూడా సరికొత్త స్కిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చే సుడిగాలి సుధీర్ టీమ్.. అందరినీ ఎంతగానో నవ్విస్తూ ఉంటుంది.



 ఈ వారం కూడా సరికొత్త స్కిట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది సుడిగాలి సుదీర్ టీమ్. మగధీర సినిమా లోనుంచి మెయిన్ ఫైట్ సీన్ ని జబర్దస్త్ లో స్కిట్  గా చేశారు. మిత్రవింద పాత్రలో రష్మీ రామ్ చరణ్ పాత్రలో సుడిగాలి సుధీర్ కనిపించగా శ్రీహరి పాత్ర లో గెటప్ శ్రీను.. కనిపించారు. ఈ క్రమంలోనే ప్రతి డైలాగ్ కూడా బాగా పేలడంతో బుల్లితెర ప్రేక్షకులు కడుపుబ్బ నవ్వుకున్నారు అనే చెప్పాలి. ఇక ఈ ప్రోమో చూస్తే ఈ వారం ఫుల్ ఎపిసోడ్ మాత్రం పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తుంది అన్నది మాత్రం అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: