ఇంతకీ ఈ వారం ఎలిమినేషన్ ఉన్నట్టా.. లేనట్టా..?
అవినాష్, అరియానా, అఖిల్, మోనాల్ ఈ వారం నామినేషన్స్ లో ఉన్నారు. అసలైతే ఈ వారం మోనాల్ బయటకు వెళ్తుందని అనుకున్నారు కాని అభిజిత్, హారిక ఫ్యాన్స్ మోనాల్ కు సపోర్ట్ చేశారని టాక్. అందుకే ఈ వారం హౌజ్ నుండి వెళ్లేందుకు అవినాష్, అఖిల్ లకు తక్కువ ఓట్లు వచ్చాయని అంటున్నారు. అయితే అఖిల్ కూడా టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. కాని ఈ వారం సేఫ్ అవుతాడా లేదా అన్న డౌట్ కూడా ఉంది. ఇదిలాఉంటే ఈ వారం అసలు ఎలిమినేషన్ అనేది ఉండదని టాక్.
అయితే చివరి దాకా తీసుకెళ్లి ఫైనల్ గా నాగ్ ఈ వారం నో ఎలిమినేషన్ అని నాగార్జున షాక్ ఇస్తాడని అంటున్నారు. అయితే 12వ వార్మ్ ఎలిమినేషన్ మిస్సయితే మాత్రం 13వ వారం మాత్రం తప్పకుండా ఎలిమినేషన్ ఉంటుందని తెలుస్తుంది. ఇప్పటికే టాప్ 5.. టాప్ 3 ఎవరెవరు ఉంటారన్నది ఇప్పటికే కొంతమంది పేర్లు వినిపిస్తున్నాయి.