వరుణ్ తేజ్ తో మూవీ చేయనున్న పవర్ స్టార్ డైరెక్టర్ ....??

GVK Writings
టాలీవుడ్ సినిమా పరిశ్రమకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ముకుందా సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చారు మెగాప్రిన్స్ వరుణ్ తేజ్. అయితే రిలీజ్ అనంతరం ఈ సినిమా ఆశించిన రేంజ్ సక్సెస్ అందుకోనప్పటికీ అందులో వరుణ్ నటనకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. ఆ తరువాత క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన కంచె సినిమాలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వరుణ్ తేజ్, ఆపై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫిదా సినిమాతో మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు.
ఇక ఆ తరువాత యువ దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన తొలిప్రేమ సినిమాతో మరొక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న వరుణ్, ఆపై విక్టరీ వెంకటేష్ తో కలిసి యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్టైనర్ ఎఫ్2 ద్వారా మరొక విజయం అందుకున్నారు. ఇక గత ఏడాది కమర్షియల్ సినిమాల దర్శకడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన గద్దలకొండ గణేష్ సినిమా ద్వారా కూడా విజయం అందుకున్న వరుణ్ ప్రస్తుతం యువ దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలావరకు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుండగా, దీని అనంతరం ఎఫ్ 3 మూవీలో కూడా వరుణ్ నటించనున్నారు.
ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే, అతి త్వరలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ కి దర్శకత్వం వహించనున్న యువ దర్శకుడు సాగర్ కె చంద్ర అతి త్వరలో వరుణ్ తేజ్ తో కూడా ఒక సినిమా చేయనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఇటీవల వరుణ్ ని కలిసి మంచి యూత్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ స్టోరీ ని ఆయనకు వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్న సాగర్, పవన్ సినిమా అనంతరం దానిని పట్టాలెక్కించనున్నాడని, అలానే టాలీవుడ్ కి చెందిన ఒక ప్రఖ్యాత నిర్మాణసంస్థ ఈ సినిమాని ఎంతో గ్రాండ్ లెవెల్లో నిర్మించనుందని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలి అంటే దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన బయటకు రావాల్సిందే అని అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: