ఇంత స్టైలిష్ లుక్ లో నడుచుకుంటూ వస్తున్న ఈ హీరోని గుర్తుపట్టారా..??

Anilkumar
మన టాలీవుడ్ లో ఉన్న హీరో, హీరోయిన్లు షూటింగ్ల కోసమని.. స్పెషల్ ట్రిప్స్ అని ఇతర దేశాలకు వెళ్లి వస్తుంటారు. అలా మన హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వాళ్లు సడెన్ గా దర్శనమిస్తూ అందరికి షాక్ కి గురిచేస్తారు. అలా ఎయిర్ పోర్ట్ లో నుంచి బయటికి వచ్చే టాప్ స్టార్స్ ని ఫొటోస్ తీయడానికి కొన్ని నేషనల్ మీడియా వాళ్లు నానా తంటాలు పడుతుంటారు. ఇక మరీ ముఖ్యంగా షూటింగుల కోసం విమానాశ్రయాల్లో సంచరించే టాప్ హీరోలు .. హీరోయిన్ల ఎయిర్ పోర్ట్ లుక్స్ ని క్యాచ్ చేసేందుకు కొన్ని జాతీయ మీడియాల కెమెరాలు నిరంతరం కాపు కాసుకుని మరీ వెయిట్ చేస్తుంటాయి.అలా ఇటీవల సెలబ్రిటీల ఎయిర్ పోర్ట్ లుక్ లన్నీ బయటకు వచ్చాయి.
ఇప్పటికే టాలీవుడ్ అగ్ర హీరోలకు మరియు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన కొన్ని ఫిక్స్ లీక్ అయి.. సోషల్ మీడియాలలో ఎంత వైరల్ గా మారాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ కరోనా కాలంలో మాస్క్ తొడిగి.. పీపీఈ కిట్లతోనూ దొరికిపోయారు చాలా మంది సెలబ్రిటీలు. ఇక లేటెస్టుగా ఆర్.ఆర్.ఆర్ షూటింగుతో బిజీగా ఉన్న  టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇలా శంషాబాద్ లో కెమెరా కంటికి చిక్కారు. ఆయన ఊబర్ కూల్ లుక్ పై అభిమానులు రకరకాలుగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
తారక్ ఎక్కడ ఉన్నా ఆ స్టైలే వేరు.చాలా సందర్భాల్లో కూల్ గా ప్లెజెంట్ గా ఉంటాడు. అతడి రూపానికి తగ్గ డిజైనర్ లుక్ తో ఆకర్షిస్తాడు. తాజాగా క్యాజువల్ - కూల్ లుక్ తో ఈసారి కూడా కనిపించాడు. ఆకుపచ్చ టీ-షర్టు క్రీమ్-రంగు చినోస్ కలయికతో స్టైలిష్ గా ఎన్టీఆర్ లుక్ ఇప్పుడు అందరినీ ఎంతో ఆతృతగా మైమరిపిస్తోంది.సోషల్ మీడియాలో ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ ఇప్పుడు ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది. ముఖ్యంగా నందమూరి అభిమానులు తారక్ లుక్స్ కి ఫిదా అయి.. ఈ పిక్ ని తెగ వైరల్ చేస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: