మోనాల్ vs అవినాష్.. ఎవరు ఉంటారు..? ఎవరు వెళ్తారు..?
అయితే రెండు వారాలుగా మోనాల్ కూడా సీరియస్ గానే ఆడుతుంది. ఈ వీక్ నామినేషన్స్ లో ఆమె స్ట్రాంగ్ గా తన వాయిస్ వినిపించాలని అనుకుంది. ఈ క్రమంలోనే అఖిల్ ను నువ్వు మైండ్ పెట్టి ఆడుతావు.. నేను హార్ట్ పెట్టి ఆడుతా అని అన్నది. ఇక అఖిల్ మీద ఉన్న కోపాన్ని అవినాష్ మీద చూపించింది. అరియానాతో మాట్లాడుతున్న టైం లో అవినాష్ తెలుగులో మాట్లాడమని చెప్పినందుకు మోనాల్ గట్టిగా అరుస్తూ నువ్వు మాట్లాడకు అని అన్నది.
ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో మోనాల్, అవినాష్ లకే డేంజర్ జోన్ ఉందని చెప్పొచ్చు. ఈ ఇద్దరిలో ఎవరు స్ట్రాంగ్ ఎవరు వీక్ అన్నది ఆడియెన్స్ డిసైడ్ చేస్తారు. అయితే మోనాల్ తో పోల్చుకుంటే బిగ్ బాస్ సీజన్ 4లో అవినాష్ చాలా బాగా ఎంటర్టైన్ చేశాడు. మోనాల్ రెండు మూడు వారాల నుండే ఆట ఆడుతుందని ఆడియెన్స్ ఫీల్ అవుతున్నారు. మరి ఇదే రిజల్ట్ ఓటింగ్ లో చూపిస్తారో లేదో చూడాలి.