ఈసారి ఆ కంటెస్టెంట్ ఎలిమినేషన్ పక్కా..?

Satya
బిగ్ బాస్ సీజన్ ఫోర్ తెలుగులో ఇపుడు కీలకమైన ఘట్టానికి చేరుకుంది. పదమూడవ వారం ఆట రక్తి కట్టిసోంది. ఇక కౌంట్ డౌన్ కూడా మొదలైపోయింది. ఈసారి నామినేషన్ లో అయిదుగురు ఉండడం విశేషం. మొత్తం ఏడుగురిలో టాప్ ఫైవ్ లోకి అయిదుగురే వెళ్తారు. మరి ఆ లక్కీ ఎవరిని వరిస్తుందో కూడా ఈసారి తెలిసిపోతోంది. మరో వైపు చూస్తే ఈసారి నామినేషన్స్ లో ఉన్న వారిలో అవినాష్, అఖిల్. అభిజిత్, హారిక, మోనాల్ కనిపిస్తున్నారు  సోహెల్, ఆరియానా నామినేట్ కాకుండా మిగిలారు.
అయితే ఈసారి దాదాపుగా అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే నామినేషన్స్ లో ఉన్నారు. అభిజిత్ ఒక్కవారం తప్ప ప్రతీసారి నామినేట్ కావడం జనాల నుంచి తీర్పుతో బయటపడడం జరుగుతోంది. ఇక దేత్తడి హారిక కూడా ఈసారి నామినేషన్ లో ఉంది. ఆమె కూడా ఇప్పటికి అనేకసార్లు భారీ ఓట్లతో హౌజ్ లోకి వచ్చింది. అదే విధంగా అఖిల్ స్ట్రాంగ్ గానే ఉన్నాడు. మిగిలింది మోనాల్ గజ్జర్, అవినాష్. ఈ ఇద్దరిలో మోనాల్ ఈ మధ్యనే బాగా ఆడుతూ స్ట్రాంగ్ ప్లేయర్ గా నిలబడింది. ఆమె వీక్ అని గత వారం చెప్పిన అవినాష్ తానే ఎలిమినేష్ లో ఉండి ఎవిక్షన్ కార్డు ద్వారా సేఫ్ అయ్యాడు.
ఈసారి అలాంటి చాన్స్ ఉండదు కాబట్టి కచ్చితంగా అవినాష్ మోనాల్ లలో ఒకరు బయటకు వెళ్ళకతప్పదు అంటున్నారు. మరి ఈ ఇద్దరిలో మోనాల్ నామినేషన్ టైం లో సరైన పాయింట్లు చూపిస్తూ అవినాష్ తో డిబేట్ చేసింది. అంతే కాదు ఆమె తాను స్ట్రాంగ్ అని కూడా నిరూపించుకుంటూ ముందుకు సాగుతోంది. దాంతో ఈవారం ఎలిమినేట్ అయ్యేది కచ్చితంగా అవినాష్ అనే అంటున్నారు. అవినాష్ కూడా గత వారం ఎలిమినేట్ అయి కూడా ఎవిక్షన్ కార్డుతో సేఫ్ అవడంతోనే తన మీద తాను నమ్మకం కోల్పోయినట్లుగా కనిపించాడు. మొత్తానికి చూస్తే ఏదైనా అద్భుతం జరిగితే తప్ప అవినాష్ ఇంటికి వెళ్ళక తప్పదు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: