ప్రకాష్ రాజ్ పై బండ్ల గణేష్ ఫైర్.. కారణం ఇదే?

Satvika
ఇటీవల సినీ ఇండస్ట్రీలో ఒక వార్త సంచలనంగా మారింది.. అదే పవన్ కళ్యాణ్ పై సినీ నటుడు ప్రకాష్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం. జనసేన పార్టీకి అధ్యక్షులు గా ఉండి , సొంతంగా పోటీ చెయ్యకుండా వేరొక పార్టీకి మద్దతు తెలపడం ఎంతవరకు సమంజసం అంటూ ఆయన అన్నారు. ఆ మాటలు కాస్త పవన్ ఫ్యాన్స్ కు మింగుడు పడలేదు దీంతో కొంచెం చర్చలు జరుగుతున్నాయి.. ప్రకాష్ రాజ్ అన్న మాటలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి..


పవన్ కల్యాణ్‌కుఏమైందో నాకు నిజంగా అర్ధం కావండం లేదు. ఆయన నిర్ణయం పట్ల నిరుత్సాహానికి గురయ్యా. మీరు నాయకుడు. జనసేన పార్టీ ఉంది. మీరు ఇంకో నాయకుడికి మద్దతు ఎందుకు తెలుపుతున్నారో.. ఒక పార్టీ నేత అయ్యి ఉండి, వెరేకరిని సపోర్ట్ చేస్తూ ఉండటం అర్థం కావడం లేదు.. గతంలో పార్టీ స్థాపించిన కూడా వారికి మద్దతు తెలిపి తప్పు చేశాను.. వారు ద్రోహం చేశారని గత ఎన్నికల్లో అన్నారు. మళ్లీ ఇప్పుడు మీకు నాయకుడిగా కనిపిస్తున్నారు. మీరు ఇన్ని సార్లు మారుతున్నారంటే ఊసరవెల్లి అయి ఉండాలి. అని ప్రకాష్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.. 


ఈ విషయం పై పవన్ కళ్యాణ్ అన్న ఘాటుగా స్పందించాడు..నువ్వో కుసంస్కారివి అంటూ విరుచుకుపడ్డారు. నాగబాబు విమర్శలపై ప్రకాష్ రాజ్‌ కూడా రివర్స్ కౌంట్ ఇచ్చారు.. దాంతో ఈ విషయం ఇంకాస్త జోరు అందుకుంది..ఒకవైపు రాజకీయ రచ్ఛలతో పాటుగా, టాలీవుడ్ లో కూడా చర్చలకు దారి తీసింది.ఇకపోతే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల పై పవన్ అభిమానులు కూడా వారి స్టయిల్లో స్పందిస్తున్నారు. తాజాగా ఈ విషయం పై నటుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందించి ప్రకాష్ రాజ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు.  


పవన్ కళ్యాణ్ మహోన్నతమైన వ్యక్తి రాజకీయాలు ఎవరైనా చేసుకోవచ్చు రాజకీయాలు ఎవరైనా మాట్లాడుకోవచ్చు కాని వ్యక్తిత్వం గురించి పవన్ కళ్యాణ్ గురించి ఎవరు మాట్లాడినా నేను సహించను పవన్ కళ్యాణ్ నా దృష్టిలో నాకు ఎప్పటికీ దైవంతో సమానం. ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు ఎంతో మంది సాంకేతిక నిపుణులు ఎంతోమంది నిర్మాతల్ని పరిచయం చేసిన ఘనత మా దైవం పవన్ కళ్యాణ్' అంటూ పవన్ ఆయన ట్వీట్ చేశారు.. దీంతో ఆ రచ్చ కాస్త జోరు అందుకుంది.. ఎక్కడ చూసిన ఇదే మాట వినపడుతుంది.. ఎది ఏమైనా ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది..మరి ఎలా ఉంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: