విలక్షణ నటుడితో హీరోయిన్ ఛాన్స్ కొట్టేసిన రాశి ఖన్నా

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి...రాశిఖన్నా... ఊహలు గుస గుస లాడే సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్ ల మనసు కొల్లగొట్టేసింది. చాలా క్యూట్ గా చబ్బీగా వుండే ఈ బ్యూటీ యూత్ కి డ్రీం గర్ల్ అయిపోయింది. ఒట్టి అందం మాత్రమే కాదు తనదైన స్వరముతో పాటలు పాడుతూ ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇక తన అందం, అభినయంతో టాలీవుడ్  ప్రేక్షకులను అలరిస్తున్న రాశీఖన్నా ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీపై కన్నేసింది. ఇప్పటికే ఇక్కడ కొన్ని సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు బంపరాఫర్ వచ్చినట్లు తెలుస్తోంది.తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసే నటుడు విక్రమ్.


ఇక విక్రమ్ పక్కన నటించే ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ అయిన ఊరుకుంటుందా.. ఎగిరి గంతేస్తుంది.ఇప్పుడు రాశిఖన్నా కి ఆ అవకాశం వచ్చింది. ఇక  విలక్షణ నటుడు విక్రమ్, దర్శకుడు హరి కాంబినేషన్లో తెరకెక్కబోయే హ్యాట్రిక్ మూవీలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. విక్రమ్, హరి కాంబోలో గతంలో సామి, సామి-2.. సినిమాలు తెరకెక్కాయి. దీంతో ఈ హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాలో అవకాశం వచ్చినందుకు రాశి ఖన్నా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందట..తెలుగులో ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించినా ఈ హాట్ చబ్బీ బ్యూటీ ఒక్క యంగ్ టైగర్ ఎన్టీఆర్ మినహా  ఏ స్టార్ హీరో పక్కనా నటించే అవకాశం  దక్కించుకోలేకపోయింది.


ఇక  రాశీఖన్నా కోలీవుడ్‌లో మాత్రం విక్రమ్ సరసన నటించే పెద్ద అవకాశం  కొట్టేసిందని సినీ వర్గాలు కోడై కూస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. నిజానికి దర్శకుడు హరి, సూర్యతో ఓ సినిమా ప్రారంభం కావాల్సి ఉంది. ఆ ప్రాజెక్టుపై ఇంకా స్పష్టత రాకపోవడంతో ఆయన విక్రమ్‌తో సినిమా మొదలు పెట్టనున్నారు.తరువాత సూర్య తో యముడు సిరీస్ లో ఇంకో మూవీ తీసే ఛాన్స్ ఉంది.ఇక ఇలాంటి మరెన్నో మూవీ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి.. ఇంకా మరెన్నో మూవీ అప్ డేట్స్ గురించి తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: