అక్కినేని ఫ్యామిలీ పరిచయమే అభిజిత్ ను విన్నర్ చేస్తుందా..?
అయితే అభిజిత్ టాప్ లో ఉండడానికి మరో ప్రధాన కారణం అతను అక్కినేని ఫ్యామిలీకి దగ్గర మనిషి అని అంటున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాతో హీరోగా పరిచయమైన అభిజిత్ ఆ సినిమాలో అక్కినేని అమల నటించడంతో ఆమెకు బాగా దగ్గరయ్యాడు. దానితో అక్కినేని ఫ్యామిలీ మొత్తం అతనికి సపోర్ట్ గా నిలుస్తుంది. అభిజిత్ బిగ్ బాస్ కు రాడానికి కారణం కూడా నాగ చైతన్య అని అంటున్నారు.
ఏది ఎలా ఉన్నా అభిజిత్ టైటిల్ విన్నర్ అవుతాడని చెబుతుండగా సోషల్ మీడియాలో హంగామా చూస్తే అది నిజమే అని అనిపిస్తుంది. మరి అక్కినేని ఫ్యాన్స్ సపోర్ట్ వల్లే అభిజిత్ కు ఈ రకమైన క్రేజ్ వచ్చిందని అంటున్నారు. అయితే అభిజిత్ కు కనిపించేలా సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉన్నా మిగతా హౌజ్ మేట్స్ కు కూడా కనిపించకుండా సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తుంది.