సునీల్ ఇక హీరో గా చేయడా.. కొత్త అవతారం..?

P.Nishanth Kumar
టాలీవుడ్ లో కమెడియన్ గా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత హీరో గా చేసి పెద్ద పొరపాటే చేశానని ఇప్పుడు అనుకుంటూ ఉండొచ్చు.. కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు హీరో గా మారి కొన్ని సినిమాలు హిట్ కొట్టినా ఆ తర్వాత అన్ని ఫ్లాప్ సినిమాలు చేసి దారుణమైన ఇమేజ్ ని మూటగట్టుకున్నాడు.. ఇప్పుడు హీరో గా, కమెడియన్ గా రెండు విధాలుగా సునీల్ కి చేతిలో పెద్దగా సినిమాలు లేవని చెప్పాలి.. రెండు రకాల పాత్రలు చేస్తేనన్నా ఎదో ఒక రూట్లో సెట్ అయ్యేవాడు కానీ కమెడియన్ గా మానేసి హీరో గా చేయడంతో ప్రజలు ఆయన్ని పెద్ద గా రిసీవ్ చేసుకోలేకపోయారు..

సునీల్ హీరో గా చేసిన అందాల రాముడు , మర్యాద రామన్న సినిమాలు తప్పా ఒక్క సినిమాకూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదనే చెప్పాలి.. దాంతో ఇటీవలే కమెడియన్ గా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు..ప్రేక్షకులకు అది రుచించకపోయినప్పటికీ కలర్ ఫోటో లో మంచి పాత్ర చేసి మంచి మార్కులు కొట్టేశారు. ఈ సినిమా తో కమ్ బ్యాక్ చేయాలన్న సునీల్ కోరిక మంచిదే అయినా అందులో విలన్ పాత్ర చేయడం ప్రేక్షకులు ఎక్కువగా రిసీవ్ చేసుకోలేదని చెప్పాలి.. కానీ నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ఇక హీరో గా కొన్ని రోజులుగా దూరం గా ఉంటున్న సునీల్ ఇప్పుడు మరో డేరింగ్ నిర్ణయం తీసుకోబోతున్నాడట..

హీరోగా.. విలన్ గా.. కమెడియన్ గా ఇలా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న సునీల్ మరో వైపు దర్శకుడిగా కూడా ప్రయత్నించేందుకు సిద్దం అవుతున్నాడు.ప్రస్తుతం హీరోగా వీఎన్ ఆధిత్య దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న సునీల్.. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న పుష్ప సినిమాలో విలన్ గా కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరో వైపు ఒకటి రెండు సినిమాల్లో కమెడియన్ గా కూడా కనిపించబోతున్నాడు. ఈ సమయంలోనే సునీల్ ఒక మరాఠీ సినిమాను తెలుగులో రీమేక్ చేసేందుకు సిద్దం అయ్యాడట. సన్నిహితుడితో కలిసి సునీల్ ఆ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించబోతున్నాడట.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: