మహేష్ హీరో అయితే నేను విలన్ గా చేస్తానన్న ఇళయదళపతి విజయ్ .....??

GVK Writings
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రముఖ తమిళ దర్శకుడు  మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా స్పైడర్. మూడేళ్ళ క్రితం మంచి అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. మహేష్ కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ఈ సినిమాకి హరీష్ జయరాజ్ మ్యూజిక్ ని అందించారు. ద్విభాషా సినిమాగా తెలుగు తమిళ భాషల్లో ఏక కాలంలో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో ఏజెంట్ శివ అనే పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన అద్భుత నటనతో తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులను కూడా ఎంతో ఆకట్టుకున్నారు.
అయితే ఈ సినిమా పరాజయం తర్వాత ఒకానొక ఇంటర్వ్యూ లో భాగంగా మురుగదాస్ మాట్లాడుతూ స్పైడర్ సినిమా పై మహేష్ మరియు తాను ఎంతో అంచనాలు పెట్టుకున్నాం అని అయితే ఒక్కసారిగా రిలీజ్ అనంతరం సినిమా ఫ్లాప్  అవడంతో తాను ఎంతో నిరాశ గురయ్యానని అయితే సినిమా ఫ్లాప్ అయినప్పటికీ కూడా మహేష్ మాత్రం ఎప్పటివలె తనని ఎంతో ప్రోత్సహించారని చెప్పుకొచ్చారు.
ఇక అదే సమయంలో మహేష్ బాబుతో కలిసి పాల్గొన్న ఒక ఇంటర్వ్యూ లో భాగంగా మురుగదాస్ మాట్లాడుతూ అంతకుముందు కొన్నాళ్ళ క్రితం తన దగ్గర ఒక స్టోరీ ఉందని అదే స్టోరీని తమిళ నటుడు ఇళయదళపతి విజయ్ కి వినిపించానని, ద్విభాషా స్టోరీ అయిన ఆ మూవీ లో తెలుగు వర్షన్ లో మహేష్ బాబు హీరో అయితే మీరు విలన్ గా చేయాల్సి ఉంటుందని అలాగే తమిళ వెర్షన్ లో మీరు హీరో అయితే మహేష్ బాబు విలన్ గా చేస్తారని  విజయ్ తో చెప్పానని అన్నారు. అయితే తాను తప్పకుండా చేస్తానని, అయితే అందుకు సంబంధించిన విజయ్ ఒక కండిషన్ మాత్రం పెట్టారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తెలుగు వర్షన్ లో మహేష్ బాబు హీరో అయితేనే తాను విలన్ గా చేస్తాను అని విజయ్, మురుగదాస్ తో చెప్పటం జరిగిందట. ఇక ఆ ఇంటర్వ్యూ లో భాగంగా గతంలోని ఆ ఘటనను గుర్తు చేసుకున్న మురుగదాస్ ఆ తర్వాత అనుకోని కొన్ని కారణాలవల్ల ఆ ద్విభాషా సినిమా కార్యరూపం దాల్చలేదని అన్నారు. అయితే ఎప్పటికైనా వారిద్దరితో కలిసి ఒక అద్భుతమైన సినిమా చేస్తానని కూడా మురుగదాస్ చెప్పడం జరిగింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: