బిగ్ బాస్ 4 : చివరి వారాల్లో గ్రాఫ్ పెంచుకుంటున్న ఆ ఇద్దరు..!

shami
బిగ్ బాస్ సీజన్ 4లో చివరి వారాల్లోకి వచ్చే సరికి టఫ్ ఫైట్ జరగడం కామన్. కంటెస్టంట్స్ అందరు అసలు సత్తా చాటాల్సిన టైం ఇదే అని చెప్పొచ్చు. ఇక మునుపటి కన్నా ఇప్పుడు ప్రస్తుత వారాల్లో సత్తా చాటుతున్నారు ఓ ఇద్దరు కంటెస్టంట్స్. ముందునుండి ఆట మీద ఫోకస్ ఉన్నా ఇప్పుడు మరింత టఫ్ ఫైట్ ఇస్తున్నారు. వారిలో ముందుగా చెప్పుకోవాల్సి వస్తే హారిక అని చెప్పొచ్చు. ఆమె చేస్తున్న టాస్కుల్లో 100 పర్సెంట్ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి.

కచ్చితంగా హారిక కూడా టాప్ 5 కంటెస్టంట్ అని చెప్పొచ్చు. ఇక ఈమధ్య కాలంలో కొద్దిగా వెనక్కి తగ్గాడు అనుకున్న అఖిల్ కూడా ఇప్పుడు మరింత టఫ్ ఫైట్ ఇస్తున్నాడు. టికెట్ టు ఫినాలే గెలిచాడు అంటే ఇప్పుడు అతని గ్రాఫ్ ఏవిధంగా పెరిగిందో అర్ధం చేసుకోవచ్చు. అయితే సోహెల్ తో స్నేహం అఖిల్ కు ప్లస్ అయ్యిందని చెప్పొచ్చు. ముందునుండి ఇద్దరు ఓ అండర్ స్టాండింగ్ తో ఆట ఆడుతున్నారు.

ఇక ఈమధ్య మోనాల్ కూడా గేం బాగా ఆడుతుంది. టాస్కుల్లో, నామినేషన్స్ లో తను బాగా డీల్ చేస్తుంది. అయితే అఖిల్ ను నామినేట్ చేసి మళ్లీ ఆమే వేరే విషయాల్లో సపోర్ట్ చేస్తుంది. బిగ్ బాస్ లాస్ట్ వీక్ నామినేషన్స్ లోనే నువ్వు మైండ్ పెట్టి ఆడుతావు.. నేను దిల్ పెట్టి ఆడుతానని అఖిల్ కు సూపర్ పంచ్ వేసింది మోనాల్. ఇలా మాట్లాడి మళ్ళీ అతనికేదో సపోర్ట్ చేస్తున్నట్టుగా తర్వాత తీరు ఉంది.                                   

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: