బిగ్ బాస్ 4 : అవినాష్ పై మోనాల్ ముద్దుల వర్షం.. ఇక ఆ తర్వాత ముగ్గురు కలిసి..?

praveen
ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 బుల్లితెర ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఇక ప్రతి వారం సరికొత్త ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది బిగ్ బాస్ షో. ప్రతివారం బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తుంది షో. అయితే ప్రతి సోమవారం నామినేషన్.. మంగళవారం ఆపాలజీ  లు... ఇక బుధవారం టాస్కులు.. గురువారం గొడవలు.. శుక్రవారం కన్ఫ్యూజన్లు.. ఇక చివరికి శని ఆదివారాలు నాగార్జున వచ్చి చేసే సందడి. ఇలా బిగ్ బాస్ షో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.



 అయితే ఇటీవలే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ నేపథ్యంలో అందరూ ఆవు బొమ్మ కింద పాలు పట్టుకునేందుకు వెళ్లగా మోనాల్ తను కావాలని తన్నింది అంటూ అవినాష్ రచ్చ రచ్చ చేశాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ టాస్క్ ముగిసిన తర్వాత... నిన్నటి ఎపిసోడ్ లో మోనాల్  అవినాష్ కి సారీ చెప్పింది. అయితే తాను  కావాలనే తన్న  లేదు అంటూ అపాలజీ ఇచ్చింది అంతటితో ఊరుకోలేదు ఏకంగా హగ్గులు  కిస్సుల వర్షం కురిపించింది అవినాష్ పై. నన్ను క్షమించు అవినాష్ నువ్వు అంతా హార్ట్ అవుతావని అనుకోలేదు... అక్కడ టాస్క్ లో భాగంగా ఏం జరిగిందో నాకు తెలియదు... అంటూ మొదట కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేసింది మోనాల్. నువ్వు ఇలా చేయడం వల్ల బయటకు వేరేలా వెళ్తుంది అని అవినాష్ చెప్పుకొచ్చాడు.



 ఇలా కాళ్ళు పట్టుకోవడం కరెక్ట్ కాదు అని అవినాష్ చెప్పడంతో ఏకంగా తనదైనశైలిలో అవినాష్ హగ్  ఇచ్చింది మోనాల్.  అంతటితో ఆగకుండా బుగ్గపై ముద్దు పెట్టింది అంతేకాదు మరోసారి అరియనా  ని పిలిచి మరి బుగ్గపై ముద్దు పెట్టింది. ఓకేనా చాలా అంటూ అవినాష్ కి కొసరి కొసరి మరీ ముద్దులు పెడుతూ కొంటెగా మాట్లాడి టైట్  హగ్  ఇచ్చింది మోనాల్. ఆ తర్వాత ముగ్గురు కలిసి హగ్  చేసుకున్నారు. మోనాల్ తన్నింది  అనే విషయాన్ని మరిచి పోయిన అవినాష్ మోనాల్ ముద్దులతో కూల్ అయిపోయాడు. ఇలా నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ కూడా బాగా ఎంటర్టైనింగ్ గా సాగిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: