ప్రభాస్ సలార్ చిత్రం లో హీరోయిన్ గా పూజ హెగ్డే
గత ఏడాది అక్షయ్ కుమార్ హీరోగా హౌస్ ఫుల్-4 అనే చిత్రం లో నటించింది.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది .. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ తో నటిస్తోంది.. తాజాగా పూజా హెగ్డే బంపర్ ఆఫర్ కొట్టేసింది .. తెలుగు, తమిళ మరియు హిందీ చిత్రాలలో చేసిన పూజా హెగ్డే తన మాతృక భాష అయినా కన్నడలో ఇప్పటివరకు ఒక్కచిత్రం చేయలేదు..చాలా రోజులకి ఇప్పుడు ఒక అవకాశం తన ఇంటి తలుపు తట్టింది .. ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే చిత్రం ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డే ని ఎంపిక చేసుకున్నట్లు మూవీ టీం చెబుతుంది ..
పాన్ ఇండియా మూవీ గా తెరక్కేకించబోతున్న ఈ సినిమాలో ఎక్కువగా కన్నడ నటీనటులు ఉంటారట .. అందుకే ఇందులో హీరోయిన్ ని కూడా కన్నడ కి చెందిన అమ్మాయినే ఎంపిక చేసుకోవాలని చిత్ర బృందం చూస్తోంది .. అందుకే మూవీ యూనిట్ పూజా హెగ్డే ని తీసుకోవాలని నిర్ణయించారు.. అయితే ఈవిషయం పై పూజా హెగ్డే ని సంప్రదించగా అందుకు తాను నటించేందుకు ఒప్పుకున్నట్టు తెలుస్తుంది .. అయితే పూజా హెగ్డే ప్రస్తుతం ప్రభాస్ తో రాధేశ్యాంలో నటిస్తుంది ..ఆ సినిమా తర్వాత సలార్ చిత్రం లో ప్రభాస్ తో నటించబోతున్నట్లు తెలుస్తోంది..
ప్రభాస్ సలార్ చిత్రం పై అంచనాలు భారీగానే ఉన్నాయి .. ఈ సినిమాని విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్నారు .. చాలా ఏళ్ళ తర్వాత పూజా హెగ్డే తన సొంత భాషలో చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తోంది