డైరెక్టర్ పై చేయిచేసుకున్న కీర్తి సురేష్
మరి వివరాల్లోకి వెళ్లిపోదామా? అప్కమింగ్ ఫిలిం "రంగ్ దే"లో నేషనల్ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ ఫిమేల్ లీడ్ పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కీర్తి సురేష్ నితిన్ కు జోడీగా కనిపిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అంశానికి చెందిన వీడియోను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా కీర్తిసురేష్ షేర్ చేసింది.
ఇందులో, కీర్తి సురేష్ డైరెక్టర్ వెంకీ అట్లూరిని ఓ గొడుగుతో కొట్టడానికి వెంటబడుతోంది. సరదాగా షూట్ చేసిన ఈ వీడియో కచ్చితంగా ప్రేక్షకులకు నవ్వు తెప్పిస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. షూటింగ్ టైం లో ఫన్ యాక్టివిటీస్ ను ఇలా ఆడియెన్స్ తో పంచుకుందికేరళ కుట్టి కీర్తి సురేష్. ఈ పోస్ట్ లో కీర్తి నితిన్ ను కూడా ట్యాగ్ చేసింది.