దిల్ రాజు భార్యలో ఈ కోణం ఉందని మీకు తెలుసా?
దిల్ రాజు భార్య గురించి తెలుసుకోవడానికి నెటిజెన్స్ విపరీతమైన ఆసక్తి కనబరిచారు. దిల్ రాజు కూడా తన భార్యతో కలిసి సందర్శించిన టెంపుల్ ఫోటోస్ ను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా ఎప్పటి కప్పుడు షేర్ చేసారు. షేర్ చేస్తున్నారు కూడా. అలాగే, ప్రతి ఈవెంట్ లో తన వైఫ్ తో కలిసి కనిపిస్తున్నారు.
దిల్ రాజు భార్య తేజశ్విని కూడా దిల్ రాజుకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నట్టు తెలుస్తోంది. సినిమాలకు సంబంధించిన అంశాలలో ఈవిడ చూపిస్తున్న చొరవ అలాగే అందిస్తున్న సలహాలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని దిల్ రాజు సన్నిహితులతో అంటున్నారట. రీసెంట్ గా ఈవిడ ఓ స్టోరీ లైన్ చెప్పారట. ఆ స్టోరీ లైన్ బాగా నచ్చడంతో వెబ్ మూవీను తెరకెక్కించాలని దిల్ రాజు ఫిక్సయ్యాడట. మొత్తానికి తేజస్విని గారు రైటర్ గా తెరకు పరిచయమవడం దాదాపు ఖాయమైపోయింది ఫిలిం నగర్లో టాక్.