వావ్.. బాలయ్య కొత్త సినిమా టైటిల్ అదిరిపోయిందిగా..!!
డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఈ కథను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.ఇక బాలయ్య - సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఈ కథని తెరపైకి తీసుకెళ్లేందుకు ఏకే ఎంటర్టైన్మెంట్స్ సన్నాహాలు చేస్తోంది.సంతోష్ శ్రీన్వాస్ ఇప్పటికే కందిరీగ, హైపర్ చిత్రాలతో తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో `అల్లుడు అదుర్స్` తీస్తున్నాడు ఈ దర్శకుడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే బాలకృష్ణ సినిమా ప్రారంభించనున్నాడు సంతోష్ శ్రీనివాస్. ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వాళ్లు ఈ కథ విని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఆ ప్రొడక్షన్ సంస్ద వారే బాలయ్యని లాక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఈ మేరకు `బలరామయ్య బరిలోకి దిగితే..` అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించారు.ఇక ఈ సినిమాల తర్వాత బాలయ్య. బి.గోపాల్ తో ఓ సినిమా చేయాల్సివుంది. మరో ప్రక్క శ్రీవాస్ కూడా బాలయ్య కోసం ఓ కథ రెడీ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది.శ్రీవాస్ డైరెక్ట్ చేయనున్న ఈ మూవీ కథను ప్రముఖ రచయిత కోన వెంకట్ కథను అందిస్తున్నారు. ఇటీవలే ఈ కథను బాలయ్యకు వినిపించగా.. అదిఆఆయనకు బాగా నచ్చి.. వెంటనే ఓకే చెప్పునట్లు తెలుస్తోంది. మొత్తానికి కొద్ది రోజులుగా కాస్త స్లో అయిన మన బాలయ్య..ఇప్పుడు వరుస చిత్రాలను లైన్లో పెడుతున్నాడు.ఇక బాలయ్య, బోయపాటి ల మూవీ వచ్చే ఏడాదిలో విడుదల కానుంది...!!