న్యూ ఇయర్ RRR అదిరిపోయే గిఫ్ట్..!
ఆర్.ఆర్.ఆర్ సినిమా ట్రైలర్ న్యూ ఇయర్ గిఫ్ట్ గా వస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా ట్రైలర్ తో సినిమాపై మరింత క్రేజ్ వస్తుందని అంటున్నారు. ఒక హీరో ఉంటేనే అద్భుతాలు చేసే రాజమౌళి ఇద్దరు హీరోలు కలిసి చేసే ఈ సినిమాతో మరోసారి తెలుగు సినిమా స్థాయి ఏంటో చూపిస్తాడని తెలుస్తుంది. ఆర్.ఆర్.ఆర్ ట్రైలర్ ఎలా ఉంటుంది.. కొమరం భీం.. సీతారామరాజు పాత్రలు ఎలా ఉండబోతాయి అన్న దాని మీద ఆడియెన్స్ లో ఎక్సయిటింగ్ మొదలైంది.
డివివి దానయ్య 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో అజయ్ దేవగన్, అలియా భట్, ఒలివియా మోరిస్ లు నటిస్తున్నారని తెలిసిందే. ఈ సినిమాకు సంబందించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ఫుల్ ఖుషి చేస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమా అదరగొట్టడం ఖాయమని చెప్పాలి.