పూరి జగన్నాథ్ పై రామ్ గోపాల్ వర్మ తల్లి కంప్లైంట్ !

Seetha Sailaja
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల్లి ఎప్పుడు మీడియా ముందుకు రారు. అయితే ఈ మధ్య ఎవరు ఊహించని విధంగా ఆమె ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. వర్మ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాల పై పలు ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ మధ్యలో దర్శకుడు పూరి జగన్నాథ్  పై తన అసహనాన్ని వ్యక్త పరచడం ఆ ఇంటర్వ్యూలో హైలెట్.


ఇంతకి వర్మ తల్లికి పూరి పై ఈ స్థాయిలో ద్వేషం ఏర్పడటం వెనుక ఒక కారణం ఉంది. తన కొడుకు ఆర్జీవీ ఇంటికి రాగానే తన లగేజ్ బ్యాగ్ లు అక్కడ పారేసి పూరి కేవ్ కి వెళ్లిపోతున్నాడట. అది తనకు నచ్చడం లేదని అసలు ఆర్జీవీ వల్ల వర్మ తనకు సమయం ఇవ్వడంలేదని ఆమె భాద పడుతోంది అంతేకాదు తన ప్రియమైన కొడుకుతో విలువైన సమయం కోల్పోవాల్సి వస్తోంది అని ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది.



 అందువలనే తనకు పూరి అంటే ద్వేషం అంటూ కామెంట్స్ చేసింది. ఈ మధ్య వర్మ జనానికి నచ్చే విధంగా సినిమాలు తీయలకపోతున్నాడు. దీనితో వర్మ ఆలోచనలు ఖాళీ అయిపోయాయా అన్న కామెంట్స్ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో పూరి వద్దకు వెళ్ళితే కొత్త ఆలోచనలు వస్థాయి అన్న ఉద్దేశంతో ఇలా ఎప్పుడు వర్మ పూరి కేవ్ లోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు అనుకోవాలి.


అయితే వర్మ ప్రతిరోజు రాత్రి ఒడ్కా త్రాగడం ఉదయం లేవగానే పోర్న్ మూవీస్ చూడటం ఒక అలవాటుగా పెట్టుకున్నాడు. ఈ విషయాలు అన్నీ తల్లి ఎదురుగా చేస్తే బాగుండదు అని ఇలా తన తల్లి ఇంటిలో కంటే పూరి జగన్నాథ్ దగ్గరే ఎక్కువ కాలం గడుపుతున్నాడు. పాపం వర్మ తల్లికి అసలు విషయాలు తెలియక తన కొడుకు పూరీ వల్ల దూరం అయిపోతున్నాడు అంటూ చాల బాధ పడుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: