నా బట్టలు నా ఇష్టం.. ఎలాగైనా వేసుకుంటా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..?
ఇటీవలే మలయాళీ ముద్దుగుమ్మ మీరా నందన్ తన లవ్ స్టోరీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా ప్రేమలో పడితే జీవితం ఎంతగానో బాగుంటుంది అని అందరూ చెబుతూ ఉంటారు అంటూ తెలిపింది. కానీ తన విషయంలో మాత్రం ప్రేమలో పడి కష్టాలు కొని తెచ్చుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది హీరోయిన్ మీరా నందన్. తమిళంలో వాల్మీకి, అయ్యానార్, చండ మారుతం, సూర్య నగరం తదితర చిత్రాల్లో నటించి ఎంతో మంది మలయాళీ ప్రేక్షకులను ఆకర్షించి అభిమానులను సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
కాగా రెండేళ్ల క్రితం వచ్చిన గోల్డ్ కాయ్ అనే సినిమా తర్వాత మళ్లీ వెండితెరపై ఎక్కడా కనిపించలేదు. ఇటీవలే మళ్లీ తన కెరియర్ పైన దృష్టి పెట్టిన మీరా నందన్అవకాశాలు దక్కించుకోవడానికి ప్రస్తుతం తన అందాలకు పని చెప్పింది. హాట్ హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. శృంగార భరితమైన భంగిమల్లో ఫోటోలు దిగుతున్న ఈ అమ్మడు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నది . ఈ క్రమంలోనే ఎంతో మందిప్రేక్షకులు మీరా నందన్ దుస్తులపై మండి పడుతూ ఉండగా.. ఇటీవల స్పందించిన ఈ అమ్మడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది తన ఇష్టం అంటూ తెలిపింది. చిన్నవయసులోనే ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూసి ప్రేమలో పడి కష్టాలు కొని తెచ్చుకున్నాను. చివరికితనని తాను ప్రేమించడం నేర్చుకున్నాను అంటూ... తెలిపింది మలయాళీ ముద్దుగుమ్మ మీరా నందన్.