బిగ్ బాస్ ఫైనల్ కి గెస్ట్ గా రాబోతున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..??
ఇక మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్‌కు చిరంజీవి ట్రోఫిని అందించారు.ఇక నాలుగో సీజన్ కోసం ముఖ్య అతిథి ఎవరనే విషయంపై ఇప్పుడు మీడియాలో అనేక ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో పలువురు పేర్లు వినిపించినప్పటికి.. క్లారిటీ రాలేదు. అయితే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా రానున్నారంటూ ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.నాలుగో సీజన్ మరో 14 రోజులపాటు సాగనున్నది. ఈ క్రమంలో ముగింపు వేడుకకు ఇప్పటి నుంచే బిగ్‌బాస్ హౌస్‌లో హంగామా కొనసాగుతున్నది. ఈ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా సమాచారం ప్రకారం.. మహేష్ బాబును కలిసి ముఖ్య అతిథిగా పాల్గొనాలని కోరగా అందుకు సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది.బిగ్‌బాస్ ముగింపు వేడుకు డిసెంబర్ 20వ తేదీన నిర్వహించేందుకు నిర్వాహకులు ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు పలువురు ప్రముఖులను, కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులను ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇక మహేష్ బాబు కనుక ఈ బిగ్ బాస్ ఫైనల్స్ కి గెస్ట్ గా వస్తే.. మహేష్ గెస్ట్ గా వెళ్లే మొట్టమొదటి రియాలిటీ షో ఇదే అవుతుంది.ఇక దీనిపై త్వరలోనే ఓ అనౌన్స్మెంట్ రానుందని తాజా సమాచారం...!!