సంగీత్ లో మెగా ఫ్యామిలీ అదిరిపోయే డాన్సులు.. వైరల్ వీడియో..?

praveen
ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం పెళ్లి సందడి లో బిజీ బిజీగా ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికీ రాజస్థాన్ చేరుకున్న మెగా ఫ్యామిలీ ప్రస్తుతం అక్కడ పెళ్లి ఫంక్షన్లో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే దీనికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో...  అభిమానులు ఎంతో మంది ఈ పెళ్లి వేడుకలను చూసి మురిసిపోతున్నారు అనే విషయం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు గారాలపట్టి నిహారిక వివాహం  రాజస్థాన్లో జరిపేందుకు ప్రస్తుతం మెగా ఫ్యామిలీ మొత్తం నిర్ణయించడంతో చాటెడ్  ఫ్లయిట్ ట్ లో మెగా ఫ్యామిలీ మొత్తం రాజస్థాన్ చేరుకుంది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే అక్కడ మెహందీ సంగీత్ ఫంక్షన్ కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు ఈ క్రమంలోనే ఇటీవల.. రాజస్థాన్లోని ఉదయపూర్ లో మెగా ఫ్యామిలీ సంగీత్ ఫంక్షన్ లో ఎంతోఎంజాయ్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది ఇది చూసిన అభిమానులు అందరూ ఎంతగానో మురిసిపోతున్నారు. సంగీత్ ఫంక్షన్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సినిమాల యొక్క పాటలు పెట్టుకుని ఎంతోమంది డాన్సులు చేస్తూ హోరెత్తిస్తున్నారు. ఇక పెళ్లి సందర్భంగా కుటుంబ సభ్యులందరూ సంగీత్ ఫంక్షన్ లో ప్రస్తుతం డాన్సులతో సందడి చేశారు.

 ముఖ్యంగా కాబోయే వధూవరులు నిహారిక చైతన్య లు మెగాస్టార్ చిరంజీవి సినిమా బావగారు బాగున్నారా అనే సినిమాలోని ఆంటీ కూతురా అమ్మో అప్సర అనే పాట పై డాన్స్ చేసి అదరగొట్టారు  అని చెప్పాలి. ఆ తర్వాత రామ్ చరణ్ హీరోగా నటించిన వినయ విధేయ రామ సినిమాలోని ఏక్ బార్ ఏక్ బార్ స్టెప్పేస్తే వన్స్ మోర్ అనే పాట పై చిన్నారులు డాన్సులతో ఇరగదీశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా ఎంజాయ్ చేస్తుండటాన్ని  చూస్తున్నా అభిమానులు అందరూ మురిసిపోతున్నారు.  ఇక  గుంటూరు డీఐజీ కొడుకు చైతన్యతో నిహారిక వివాహం ఈ నెల 9వ తేదీన జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: