రాశీఖన్నా ఒక్కచోట ఉండలేదా..?

NAGARJUNA NAKKA
అందాల తార రాశీఖన్నా కుదురుగా ఓ చోట కూర్చోవడం లేదు. ఎక్కడ ఆఫర్ వస్తే  అక్కడికి పరిగెత్తుకు పోతుంది. దీంతో ఏ పరిశ్రమలోనూ అమ్మడికి స్టెబిలీటీ లేకుండా పోయింది. బహుశా అదే కాన్సెప్ట్ ..రాశికి ర్యాంకింగ్, రేంజ్ రాకుండా అడ్డు పడుతుందనే టాక్ వినిపిస్తుంది.

సౌత్ బ్యూటీ రాశిఖన్నా తొలిప్రేమతో వచ్చిన గుర్తింపును తెలుగు పరిశ్రమలో సరిగా వాడుకోలేకపోయిందేమో అనిపిస్తుంది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో మరిన్ని ఫిలింస్ చేసినప్పటికీ ఏది వర్కవుట్ కాలేదు. దీంతో ఇక చేసేది లేక కోలీవుడ్ లో కలరింగ్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయింది. 

కోలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న రాశిఖన్నా చేతిలో ప్రస్తుతం... అరన్మణి-2, తుగ్లక్ దర్బార్, మేథావి లాంటి మంచి ప్రాజెక్ట్సే ఉన్నాయి. కానీ ఏం లాభం అక్కడ కూడా సెటిల్ గా సినిమాలు చేయకుండా ఆ పక్కనే ఉన్నా మాలీవుడ్ లోనూ తన లక్ టెస్ట్ చేసుకుందామని చూస్తుంది.

రీసెంట్ గా స్వప్పదత్ ప్రొడక్షన్లో దుల్కర్ సల్మాన్ తో హనురాఘవపూడి డైరెక్షన్ లో సినిమా చేయబోతుంది. అయితే ఈ ఫిలిం తెలుగు, తమిళం, మళయాళంలో వచ్చే ఏడాది సెకండాఫ్ కు రిలీజ్ కాబోతుంది. ఒకవిధంగా చెప్పాలంటే పాన్ ఇండియా లెవెల్ లో సినిమాను తెరకెక్కించాలని చూస్తున్నారు. ఈ సినిమాతో పాటు కుదిరితే ఓ మళయాళీ సినిమాలోనూ అమ్మడు సినిమా చేయనుందనే రూమర్స్ ఊపందుకున్నాయి. స్టడీగా ఓ పరిశ్రమను నమ్ముకోకుండా ఇలా మూడు పరిశ్రమలను కవర్ చేస్తే అసలు ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందని కొలీగ్స్ ఎంత చెప్పినా మేడమ్ గారు వినడం లేదంటున్నారు. ఈ రీజన్ తోనే సీన్ ఉండి కూడా టాప్ పొజిషన్ కు వెళ్లలేకపోతుందనేవారు ఉన్నారు.

మొత్తానికి రాశీఖన్నా దక్షిణాదిన అన్ని ఉడ్ లలోనూ తన టాలెంట్ ఏంటో చూపించింది. ఒక్కచోట తన మార్క్ ప్రదర్శించకుండా అన్ని చోట్లా తానున్నాను అన్నట్టుగా రకరకాల సినిమాల్లో నటించింది. అందుకే ఆమె ఏ ఉడ్ కు చెందిందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: