వామ్మో.. బిగ్బాస్ ఇంతమంది చూస్తున్నారా.. అసలు నిజం చెప్పిన నాగార్జున..?
ఇక ప్రతి వారం నాగార్జున వచ్చి తనదైన వాక్చాతుర్యంతో బుల్లితెర ప్రేక్షకులందరికీ ఆకర్షించడంతో పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో ఫన్నీ టాస్కులు చేయించి కంటెస్టెంట్స్ పై పేల్చే జోకులు కూడా బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంతగానో అలరిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ పోతుంది ఈ రియాలిటీ షో అయితే ప్రస్తుతం బిగ్బాస్ సీజన్ 4 చివరి అంకానికి చేరుకుంది ఇక ఈ సీజన్ లో ఎవరు గెలవబోతున్నారో అనేది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. దీంతో బుల్లితెర ప్రేక్షకులు అందరూ మరింత ఆసక్తిగా బిగ్ బాస్ షో వీక్షిస్తున్నారు.
అయితే ఓ రోజు రోజుకు బిగ్బాస్ చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య పెరిగి పోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే కేవలం బిగ్బాస్ చూస్తున్న ప్రేక్షకుల సంఖ్య మాత్రమే కాదు బిగ్ బాస్ కి వస్తున్న ఓటింగ్ కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమ అభిమాన కంటెస్టెంట్ ని ఫైనల్ కి చేర్చాలి అనే ఉద్దేశంతో ఎంతో మంది ఓటు వేసి మద్దతుగా నిలుస్తున్నారు. గత వారం లో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో బిగ్ బాస్ షో నాలుగు కోట్ల మందికి పైగా వీక్షించారు. 12 వారాల్లో దాదాపు83 శాతం మంది బిగ్ బాస్ షో వీక్షించిన ట్లు నాగార్జున తెలిపారు. అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ అందించడం తనకు ఎంతో సంతృప్తిగా ఉందని ఫైనల్ మరింత ఆసక్తికరంగా మారబోతుంది అంటూ చెప్పుకొచ్చాడు నాగార్జున