నిహారిక పెళ్ళిలో అందరి లుక్స్ అతడిపైనే ... ఇంతకీ ఎవరంటే ....??

GVK Writings
కొణిదెల వారి అమ్మాయి నిహారిక వివాహ మహోత్సవ వేడుకే నేడు రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో ఎంతో వైభవంగా జరుగనున్న విషయం తెలిసిందే. మెగాబ్రదర్ నాగబాబు, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్ సహా మెగాఫ్యామిలీ కుటంబసభ్యులు అందరూ కూడా ఇప్పటికే ఉదయ్ పూర్ చేరుకున్నారు. కాగా నిన్న సాయంత్ర్రం పవర్ స్టార్ పవన్ కూడా అక్కడికి చేరుకోవడంతో తమ వేడుకలో మరింత సందడి వచ్చిందని నాగబాబు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తమ్ముడితో కలిసి దిగిన ఫోటోని పంచుకున్నారు.

ఇక మరోవైపు నేడు ఈ వేడుకకు రానున్న పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల కోసం ఇప్పటికే మెగాసోదరులు ముగ్గురు ఘనంగా స్వాగతం పలికేందుకు పలు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే మొత్తంగా ఈ పెళ్లి వేడుకలో ఒకే ఒక్క వ్యక్తిపైనే అందరి లుక్స్ పడ్డాయి. అతడు మరెవరో కాదండి పవర్ స్టార్ తనయుడైన అకీరానందన్. తన సోదరి ఆద్య తండ్రితో పవన్ తో కలిసి ఈ వేడుకకు హాజరైన అకీరా నిన్న మెగాఫ్యామిలీ వారందరితో కలిసి సరదాగా దిగిన ఫోటోలు పలు మీడియా మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ఎంతో భారీ హైట్ ఉన్న అకీరా ప్రతి ఫొటోలో కూడా ప్రత్యేకంగా కనబడడంతో అందరి కళ్ళు అతని మీదనే ఫోకస్ చేయబడ్డాయి.

మరోవైపు ఎప్పటికప్పుడు తండ్రి పవన్ తో కలిసి దిగిన ఫోటోలను అప్పుడప్పుడు పోస్ట్ చేసే అలవాటున్న అకీరా ఇప్పటి నుండే మెగా ఫ్యాన్స్ అలానే ప్రేక్షకుల నుండి మంచి పేరు దక్కించుకుంటున్నాడు. అయితే అతడి ఆలోచనలు ఏమిటి, అసలు సినిమా పరిశ్రమలోకి అకీరా హీరోగా వస్తాడా లేదా అనే విషయాలపై పూర్తి వివరాలు తెలియనప్పటికీ, అతడికి ఇంట్రెస్ట్ ఉంటె మాత్రం తప్పకుండా నటుడిని చేస్తాను అంటూ పలు సందర్భాల్లో పవన్ చెప్పడం జరిగింది....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: