కాజల్ కు ఫ్రీ ఆఫర్ వచ్చింది కాబట్టే..!
కాజల్, గౌతమ్ కిచ్లుల పెళ్లి కరోనా నిబంధనలకు అనుగుణంగా.. బంధువుల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత హానీమూన్ ట్రిప్ కోసం... మాల్దీవ్స్ వెళ్లారు. అక్కడ ఉన్నన్ని రోజూలూ.. రోజూ ఏదో ఒక ఫొటో.. వీడియో పోస్ట్ చేసి సందడి చేసింది కాజల్. ఇలా హనీమూన్ కు వెళ్లి.. ఫోటోల్ని పెద్ద ఎత్తున పోస్టు చేసిన హీరోయిన్ కాజల్ మాత్రమే. ఫొటోగ్రాఫర్‌ని వెంటపెట్టుకుని వెళ్లిందా? అంటూ కామెడీ చేశారు నెటిజన్లు.
మాల్దీవ్స్‌లో 10 రోజులు గడపడంతో.. బిల్ కూడా బాగానే పడి ఉంటుందనుకున్నారంతా. అయితే చందమామ హానీమూన్ ఖర్చు రూపాయి కూడా లేదట. ఈ జంట బస చేసిన 'ది మురాకా హోటల్'లో ఒకరోజు ఉండాలంటే.. రెంట్ లక్షల్లో ఉంది. అయితే హోటల్ యాజమాన్యం కాజల్‌తో బిజినెస్ డీల్ కుదుర్చుకుంది. పర్యాటకులను భారీగా ఆకర్షించేందుకు వీలుగా.. సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోవర్లు ఉన్న సెలబ్రిటీలకు మాల్దీవుల పర్యాటక శాఖ ఇలా ఫ్రీ ఆపర్లు ఇస్తుందట. అందులో భాగంగానే కాజల్ హనీమూన్ ట్రిప్ ఫ్రీగా సాగిపోయింది.
కాజల్ ఇన్‌స్టాగ్రామ్‌ను దాదాపు 17 మిలియన్ మంది ఫాలో అవుతున్నారు. అంటే దాదాపు కోటి 70 లక్షలమంది. వీళ్లల్లో బాలీవుడ్.. టాలీవుడ్.. కోలీవుడ్‌కు చెందిన సెలబ్రిటీస్ ఉన్నారు. వీళ్లదంరినీ.. ఆకర్షించేందుకు.. కాజల్‌కు హనీమూన్ ట్రిప్ ఫ్రీ ఇచ్చింది మాల్దీవ్స్ పర్యాటక శాఖ. కాజల్ హనీమూన్ తర్వాత మాల్దీవ్స్‌కు సినీ సెలబ్రిటీస్ తాకిడి ఎక్కువైంది. వేదిక.. రకుల్ ప్రీత్ సింగ్ తన ఫ్యామిలీతో కలిసి 10 రోజులు అక్కడే గడిపింది. వేదిక... సమంత, చైతు దంపతులు ఆ మధ్య మాల్దీవ్స్‌లో సందడి చేశారు. ఈ ఫ్రీ ఆఫర్‌ను సమంతకు కూడా ఇచ్చినట్టున్నారు. ఇన్‌స్టాను ఫొటోలతో నింపేసింది.