ఇక థియేటర్ లో 'లాభం'.. ఫుల్ క్లారిటీ..?
అన్లాక్ మార్గదర్శకాల లో భాగంగా 50% సీటింగ్ సామర్థ్యంతో థియేటర్ లు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడో అనుమతి వచ్చింది. కానీ థియేటర్లో నిర్వాహకులు మాత్రం 50 శాతం సీటింగ్ సామర్థ్యంతో సినిమా హాలు నిర్వహిస్తే తమకు నష్టం వాటిల్లుతుందని పూర్తిగా తెరవకుండానే ఉండిపోతున్నారు ఈ క్రమంలోనే ప్రస్తుతం కొంతమంది థియేటర్ తెరిచేందుకు సిద్ధమవుతున్న తరుణంలో హీరోలు కూడా తమ సినిమాలను థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి తన తర్వాత సినిమా అయినా లాభం ఓటిటీలో విడుదల చేస్తారని గత కొన్ని రోజుల నుంచి టాక్ వినిపించింది.
కాగా తాజాగా దీనిపై చిత్రబృందం ఫుల్ క్లారిటీ ఇచ్చింది... దీంతో తమిళ హీరో విజయ్ సేతుపతి సినిమా విడుదలపై అభిమానులకు కూడా స్పష్టత వచ్చింది. లాభం సినిమాను ఓటిటీలో విడుదల చేయబోమని నేరుగా థియేటర్లోనే విడుదల చేస్తాము అంటూ చిత్ర బృందం తెలిపింది. ఇటీవలే షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల పై పలు రకాల వార్తలు రాక ఇటీవలే విజయ్ సేతుపతి సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన శృతిహాసన్ నటిస్తుండగా జననాదన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.