ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... శ్రీనివాస్ రెడ్డి అనేక సినిమాలలో సైడ్ క్యారెక్టర్ లు చేస్తూ తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నాడు.సప్తగిరి కూడా చాలా సినిమాల్లో కమెడియన్ గా నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. శ్రీనివాస్ రెడ్డి హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా కిందటేడాది ‘భాగ్యనగర వీధుల్లో గమ్మత్తు’ సినిమా వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. శ్రీనివాస్ రెడ్డికి నష్టాన్ని మిగిల్చింది. అలాగే, సప్తగిరి హీరోగా కిందటేడాది ‘వజ్రకవచధర గోవింద’ సినిమా వచ్చింది. ఇది కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. గతేడాది వీరిద్దరూ కమెడియన్లుగా పలు చిత్రాల్లో నటించారు. అయితే, ఇప్పుడు మరోసారి హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే వీళ్ళిద్దరూ కలిసి హీరోలుగా ‘90 ఎంఎల్’ ఫేమ్ శేఖర్‌రెడ్డి యెర్ర దర్శకత్వంలో ‘హౌస్ అరెస్ట్’ అనే సినిమా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్ కె.ఎస్. రవీంద్ర (బాబీ) క్లాప్‌నిచ్చారు.
ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తుండగా.. జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, చోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. ‘అదుర్స్’ రఘు, రవి ప్రకాష్, సునయన ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ప్రైమ్ షో ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో గురువారం ప్రారంభమైంది. రెగ్యులర్ షూటింగ్ సైతం నేటి నుంచే జరుగుతోంది.ఇలాంటి మరెన్నో మూవీ విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ ని ఫాలో అవ్వండి.
మరింత సమాచారం తెలుసుకోండి: