'ఆర్ఆర్ఆర్' ఫస్ట్ సాంగ్ అప్ డేట్ రెడీ....??

GVK Writings
టాలీవుడ్ ప్రఖ్యాత దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ భారీ ప్రతిష్టాత్మక సినిమా ఆర్ ఆర్ ఆర్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ ను అందిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతాన్ని సెంథిల్కుమార్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. కాగా ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తదుపరి షెడ్యూల్ అతి త్వరలో ప్రారంభం కానుండగా ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవి తర్వాత రిలీజ్ చేయనున్నట్లు టాక్. ఆలియా భట్ ఒలీవియా మోరిస్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాని దాదాపుగా రూ.500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇద్దరు హీరోల ఫస్ట్ లుక్ టీజర్స్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఒక వార్త ప్రకారం ఈ ఆర్.ఆర్.ఆర్ మూవీ లోని ఫస్ట్ సాంగ్ ని సంక్రాంతి పండుగ రోజున రిలీజ్ చేయనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలు ఉంటాయని ఇక ఈ తొలి పాట  హీరోలు ఇద్దరి కాంబినేషన్ లో వస్తుందని కాగా ఈ సాంగ్ కి కీరవాణి అద్భుతమైన మ్యూజిక్ ని అందించారు అని అంటున్నారు. మరోవైపు ఈ సినిమా ట్రైలర్ ని జనవరి ఫస్ట్ రోజున రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే ఇది నిజంగా ఆర్ఆర్ఆర్ మూవీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి పెద్ద పండుగ వార్త అని చెప్పక తప్పదు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: