ఆకట్టుకుంటున్న సాయిధరంతేజ్ సోలో సాంగ్....

Purushottham Vinay
ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. సాయి ధరమ్ తేజ్...  వరుస పరాజయాల తర్వాత 'చిత్రలహరి' సినిమాతో హిట్ కొట్టి తానేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే మంచి హిట్ సాధించి అతన్ని నిలబెట్టింది. సాయి ధరమ్ తేజ్  ప్రేమకథా చిత్రాలతో ఆకట్టుకుంటున్నాడు. ఇటీవలే 'ప్రతిరోజూ పండగే'తో భారీ హిట్ ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు "సోలో బ్రతుకు సో బెటర్" సినిమాతో ప్రేక్షకులని మెప్పించడానికి వస్తున్నాడు.సగటు వ్యక్తికి బ్యాచిలర్ లైఫ్ లోనే అసలు కిక్ ఉంటుందని చెప్పే ప్రయత్నం చేయబోతున్నాడు. ఇప్పటికే షూటింగ్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఈ చిత్ర టైటిల్ సాంగ్ రిలీజ్ చేసింది.'సున్‌లో సున్‌లో జస్ట్ బీ సోలో.. బోలో బోలో బ్యాచ్‌లర్.. సోలో బతుకే సో బెటర్' అంటూ ప్రారంభమైన ఈ పాటలో బ్యాచిలర్ లైఫ్ గొప్పతనాన్ని చెబుతూ 'పెళ్లి చాలా డేంజర్' అస్సలు ఇరుక్కోవద్దు అనే మెసేజ్ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. ఈ పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి లిరిక్స్ రాయగా, ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు .


ఈ సాంగ్ ని సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు..ప్రస్తుతం ఈ పాట యూత్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన సినిమా విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు గురించి తెలుసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: