సర్కారు వారి పాట విడుదల విషయంలో ఆ సినిమా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్న మహేష్..!!

Anilkumar
పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే ప్రారంభిస్తారనుకుంటే ఇప్పటి వరకు షూటింగ్ అప్ డేట్ లేదు. కాని ఒక్కసారి షూటింగ్ ప్రారంభిస్తే కేవలం నాలుగు లేదా అయిదు నెలల్లోనే పూర్తి చేసేలా జెట్ స్పీడ్ తో చిత్రీకరణ చేస్తారట.ఇక రీసెంట్ గా ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలతో మొదలైన సంగతి తెలిసిందే! మైత్రీ మూవీ మేకర్స్‌, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. మహేష్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ కి ప్రేక్షకుల్లో భారీ రెస్పాన్స్ లభించింది.సినిమాలో మహేష్ చాలా సరికొత్తగా కనిపించనున్నారు.

ఈ సినిమా కథ బ్యాంక్ కుంభకోణాల చుట్టూ సాగుతుందని.మహేష్ ఈ సినిమాలో ఒక బ్యాంక్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. తాజాగా సర్కారు వారి పాట సినిమా విడుదల తేదీ గురించి వార్తలు వస్తున్నాయి.సినీ వర్గాలు మరియు మీడియా సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం సర్కారు వారి పాటను ఆగస్టు 7 2021లో విడుదల చేయాలని భావిస్తున్నారట. 2015 అదే తేదీన మహేష్ బాబు నటించిన 'శ్రీమంతుడు' సినిమా విడుదల అయ్యింది. మళ్లీ వచ్చే ఏడాది అతే తేదీన సర్కారు వారి పాట సినిమాను విడుదల చేయబోతున్నారు అంటున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను అమెరికాలో చేయాలనుకున్నారు. కాని కరోనా కారణంగా షూటింగ్ అక్కడ నిర్వహించడం కష్టతరమైన పనిగా భావించిన చిత్ర యూనిట్..

 ఇటీవల కొత్త షెడ్యూల్ ని హైదరాబాద్ లోనే ప్రారంభించారు. హైదరాబాద్ షెడ్యూల్ ముగిసిన వెంటనే అమెరికా వెళ్లనుంది మూవీ టీమ్. అక్కడ దాదాపు 45 రోజుల పాటు షూటింగ్ ని జరుపుకోనుంది. ఎందుకంటే సినిమా ఎక్కువ భాగం అమెరికా నేపథ్యంలోనే సాగనుందట. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం జనవరిలో ఈ చిత్ర యూనిట్ అమెరికా వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చినట్లు సమాచారం..వీలైనంత త్వరగా సినిమాను కంప్లీట్ చేసి వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: