దేవి మాత్రమే కాదు థమన్ కూడా పవన్ తో ప్రయోగమా..?
ప్రస్తుతం పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ తో పాటుగా సూపర్ హిట్ మళయాళ మూవీ అయ్యప్పనుం కోషియం రీమేక్ కు కూడా పవన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ తో ఓ సాంగ్ పాడించాలని ఫిక్స్ అయ్యాడట థమన్. ఆల్రెడీ ఈ సినిమా కోసం సాంగ్ కంపోజిషన్ రెడీ అయినట్టు టాక్. మళయాళ వర్షన్ లో ఆ సినిమాలో అసలు పాటలే లేవు కాని తెలుగులో పవర్ స్టార్ సినిమాకు కొన్ని అంచనాలు ఉంటాయి.
తప్పకుండా ఈ సినిమా మ్యూజిక్ పరంగా కూడా అదరగొట్టాలని చూస్తున్నారు. థమన్ పవర్ స్టార్ సినిమాల ఆఫర్లతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ రెండు సినిమాలకు తన మార్క్ మ్యూజిక్ అందించి సత్తా చాటలాని చూస్తున్నాడు. పవర్ స్టార్ తో థమన్ మ్యూజిక్ సూపర్ హిట్ అయితే కాంబో రిపీట్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు.