బిగ్ బాస్ సీజన్ 4 ఫైనలిస్టులు వీరే...

Purushottham Vinay
బిగ్ బాస్ 4 సీజన్ ముగిసిపోతుంది. ఇప్పటిదాకా ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఈ షో ఇంకొక వారం పది రోజులలో ముగుస్తుంది. ఇక ఇప్పటిదాకా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వచ్చిన ఈ షోలో చివరగా అభిజిత్, అఖిల్, సోహెల్, అరియనా, హారిక, మోనాల్ లు మిగిలారు. ఇక ఓటింగ్స్ కూడా చాలా పోటా పోటీగా జరుగుతున్నాయి. ముఖ్యంగా అభిజిత్ కి అయితే రికార్డు స్థాయిలో ఓట్స్ బాగా పడుతున్నాయి. అందరికంటే ముందంజలో వున్నాడు.


 ఇక ఈ వారం అతని ఆట తీరు ఇంకా బాగుండటంతో అతనికి రికార్డు స్థాయిలో ఓట్లు పడ్డాయని సమాచారం అందుతుంది.ఫినాలేకు వెళ్లే టాప్ 5 కంటెస్టెంట్స్‌ని రివీల్ చేసుకుంటూ వెళ్తా అంటూ నాగార్జున చెప్పే మాటలతో స్టార్ మా తాజాగా ఒక ప్రోమోను వదిలింది. అంటే, ఈరోజు ఎపిసోడ్‌లో కొంత మంది ఫైనలిస్ట్‌లను నాగార్జున ప్రకటిస్తారు. అలాగే, ఈవారం ఎలిమినేట్ అయ్యే ఇంటి సభ్యుడిని రేపు ప్రకటించే అవకాశం ఉంది.


కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మోనాల్ ఎలిమినేట్ అయ్యిందట.. ఈ వారం మోనాల్ కి చాలా తక్కువ ఒటింగ్స్ పడ్డాయట. అందువల్ల మోనాల్ ఈవారం ఎలిమినేట్ అవుతుందట... ఇక టాప్ 5 లోకి అభిజిత్, అఖిల్, సోహెల్, అరియానా, హారిక అడుగుపెట్టబోతున్నారని సమాచారం... ఇక ఇలాంటి మరెన్నో బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి... 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: