ఐ మిస్ యూ సుధీర్.. 'ఢీ'షోలో ప్రేమ బయటపెట్టిన రష్మి..?
ఏది ఏమైనా ఇద్దరు కలిసి స్టేజి మీద కనిపించారు అంటే ఆ క్రేజే వేరు ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఇక తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చినప్పటికీ అటు ప్రేక్షకుల్లో మాత్రం ఎప్పుడు వీరిద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు అనే భావన మాత్రం ఎప్పుడూ పోవడం లేదు. అయితే ప్రస్తుతం ఈటీవీ లో ప్రసారమయ్యే డాన్స్ రియాల్టీ షో ఢీ లో వీరిద్దరు టీం లీడర్ గా చేస్తూ ఉన్నారు. ఇద్దరు ఓవైపు టీం లీడర్ గా చేస్తూ ఎంతో ఎంటర్టైన్మెంట్ పెంచారు. కానీ కొత్త సీజన్లో మాత్రం పూర్తిగా తారుమారు అయిపోయింది ఒకప్పుడు సుడిగాలి సుధీర్ రష్మీ టీం లీడర్ గా ఉండగా.. ఈసారి మాత్రం ఆది సుదీర్ ఒకవైపు టీం లీడర్ గా ఉండగా రష్మీ తో పాటు మరో అమ్మాయి కూడా టీం లీడర్ గా ఉంది.
దీనికి సంబంధించిన ప్రోమో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇక ఈ ప్రో మొత్తం ఎంతో మొత్తం ఎంతో ఎంటర్టైనింగ్ గా సాగిపోయింది అని చెప్పాలి. అయితే ఇక ఈ ప్రోగ్రామ్లో భాగంగా ప్రస్తుతం సుడిగాలి సుదీర్ పక్కన టీం లీడర్ గా లేవు కదా ఏమైనా మిస్ అవుతున్నావా రష్మీ అంటూ యాంకర్ ప్రదీప్ ప్రశ్నించగా.. సుధీర్ వైపు కోర చూపులు చూస్తూ సుధీర్ ని ఎప్పుడు మిస్ అవుతాను ఐ మిస్ యు సుదీర్ అని చెబుతూ ఇద్దరు సైగలు చేసుకుంటారు... చూసిన అభిమానులు మురిసిపోతారు. సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.