సినిమా హిట్‌.. హీరో హీరోయిన్ల కాంబినేషన్‌ రిపీట్‌ !

NAGARJUNA NAKKA
సినిమా హిట్‌ అయితే.. హీరో హీరోయిన్ల కాంబినేషన్‌ రిపీట్‌ కావడం కామనే. అయితే ఒక్కోసారి ఎవరూ దొరక్క కాంబినేషన్‌ రిపీట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి సందర్భాలు ఈ మధ్య పెరిగిపోయాయి. హీరో, హీరోయిన్ల రిపీట్‌ కాంబినేషన్ వెనకాల ఒక్కొక్కరిదీ ఒక్కో రీజన్‌. ముందు ఒక హీరోయిన్ని అనునకుంటే.. సెట్‌ కాక మరోసారి ఆ హీరోతో నటించిన హీరోయిన్స్‌  ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం.
ఖైదీ నంబర్ 150 తర్వాత చిరంజీవి, కాజల్‌ మళ్లీ జత కడుతున్నారంటే.. హిట్‌ సెంటిమెంట్‌ మెయిన్‌ రీజన్‌ కాదు. ఖైదీ నంబర్ 150లో హీరోయిన్‌గా చాలామందిని అనుకున్నా కుదర లేదు. ఎవరూ దొరక్క చివరి ఛాయిస్‌గా కాజల్‌ను ఎంచుకున్నారు. కొరటాల దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీలో హీరోయిన్‌గా త్రిషను ఎంచుకున్నారు. క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ కారణంగా త్రిష తప్పుకోవడంతో.. ఆ ఆఫర్‌ కాజల్‌ను వరించింది. ఇలా రెండుసార్లు చిరంజీవి పక్కన నటించే ఛాన్స్‌ను అనుకోకుండా అందుకుంది కాజల్.‌
బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ తర్వాత శృతిహాసన్‌ మళ్లీ యాక్టింగ్‌పై ధ్యాస పెట్టింది. అయితే.. ఈ అమ్మడికి ఛాన్సులు ఇవ్వడానికి స్టార్స్‌ఎవ్వరూ ముందుకు రాలేదు. వకీల్‌ సాబ్‌లో పవన్‌కు జోడీగా చాలామందిని అనుకున్నా..  ఎవరూ సెట్‌కాక శృతిహాసన్‌ను తీసుకున్నారు. గబ్బర్‌సింగ్‌తో నటించి తనపైన ఉన్న ఐరెన్‌లెగ్ ముద్ర చెరిపేసుకున్న శృతి.. కాటమరాయుడుతో రెండోసారి జత కట్టింది. వకీల్‌సాబ్‌ షూటింగ్‌ మొదలైనా.. పవన్‌, శృతి  కలయికలో వచ్చే సీన్స్‌ ఇంకా తీయలేదు.
బలుపు మూవీతో హిట్‌ పెయిర్‌ అనిపించుకున్న రవితేజ, శృతిహాసన్‌ ప్రస్తుతం క్రాక్‌ మూవీ చేస్తున్నారు. బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్‌ తర్వాత శృతి నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం. మొత్తానికి హీరో హీరోయిన్ల కాంబినేషన్ రిపీట్ అవుతోంది. ఒక్కసారి ఒక్క కాంబినేషన్ హిట్ అయితే చాలు ఆ కాంబినేషన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చూద్దాం.. ముందు ముందు ఎలాంటి కాంబినేషన్ లు రిపీట్ అవుతాయో.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: