జబర్దస్త్ లో రోజా కొత్త అవతారం.. హైపర్ ఆది కోరడంతో..?
ఇక సాధారణంగానే జబర్దస్త్ కమెడియన్స్ అందరూ కూడా ప్రతివారం సరి కొత్త స్కిట్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారూ. అయితే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ స్కిట్ లో జడ్జ్ ల ఇన్వాల్వ్మెంట్ కూడా ఎక్కువ అయింది అన్న విషయం తెలిసిందే. ఎంతో స్పాంటేనియస్గా స్కిట్ జరుగుతున్న సమయంలో అటు జడ్జీలు కూడా పంచులు వేస్తూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నారు. సాధారణంగానే జబర్దస్త్ లో జడ్జి గా ఉండే రోజా.. స్కిట్ జరుగుతున్న సమయంలో తనదైన పంచులు వేసి నవ్విస్తూ ఉంటారు అనే విషయం తెలిసిందే..
ఇక ఇటీవల మరోసారి స్కిట్ లో భాగం అయినా జడ్జి రోజా బుల్లితెర ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించింది. ఇటీవల జబర్దస్త్ కి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో చూస్తుంటే ఈసారి ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్క అన్న విధంగా ఉంది. ఈ క్రమంలోనే ప్రోమో మొదలవ్వగానే హైపర్ ఆది టీం లో జబర్దస్త్ లో ఉన్న సభ్యులు అందరూ కూడా స్కూల్ డ్రెస్ వేసుకొని వస్తారు. స్కిట్ లో భాగంగానే జడ్జి రోజా హిస్టరీ టీచర్ అవతారమెత్తి హిస్టరీ అంటే ఏంటి అంటూ అందరినీ ప్రశ్నలు అడుగుతూ ఉంటుంది. హిస్టరీ టీచర్ గా మారిన రోజా అందరికీ ఎంతగానో కామెడీ పంచుతుంది.