తెలుగు సినిమాలపైనే ఆసక్తి !

NAGARJUNA NAKKA
యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నాడు. అతను  ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనేకంటే మనవాళ్లే ఎక్కువగా హైర్ చేసుకుంటున్నారు అనడం బెటరేమో. తాజాగా మరో రెండు తెలుగు ప్రాజెక్ట్ లకు సైన్ చేసి హీరోస్ కా బాప్ అనిపించుకోవాలని చూస్తున్నాడు.

యాక్షన్ కింగ్ అర్జున్ చాలా గ్యాప్ తర్వాత తెలుగు సినిమాలు చేస్తున్నాడు. నితిన్ తో "లై" చేసినప్పటికీ అది అంతగా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత నాపేరు సూర్యతో మెరవాలని చూశాడు. సినిమా అంతా బాగుంటుంది. బన్నీ ఫాదర్ పాత్రలో అర్జున్ బాగానే మెరిశాడు. కమర్షియల్ యాంగిల్ లేకపోవడంతో సినిమాలో సరుకు లేదనేశారు.

రీసెంట్ గా రవితేజ ఖిలాడీలోను అర్జున్ మంచి "కీ" రోల్ పోషిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో  యాక్షన్ కింగ్ రోల్ కు  ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మరీ రిక్రూట్ చేసుకున్నారు. అలాగే రెమ్యునరేషన్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఈ తమిళ హీరోని శాటిస్ ఫై చేస్తున్నారు. కోలీవుడ్ లో విజయ్ ఆంటోని లాంటి యంగ్ హీరోలతో చేస్తూ దూసుకుపోతోన్న ఇదే అర్జున్ ఇప్పుడు తెలుగు హీరోలతోను
పోటీ పడాలని చూస్తున్నాడు.

తాజాగా పూరీ జగన్నాథ్ ఫైటర్ లో హీరో తండ్రి పాత్రకు యాక్షన్ కింగ్ సెలెక్ట్ అయినట్లుగా తెలుస్తుంది.తెలుగులో వరుసగా హీరోల ఫాదర్ రోల్ పోషిస్తూ ముందుకు మూవ్ అవుతున్న అర్జున్ కు ఈసారి తెలుగులో మంచి బ్రేక్ వస్తుందనే ఆశతో ఉన్నాడు. నిజానికి కోలీవుడ్ ఆర్టిస్ట్ లెవరు  ఈమధ్యన టాలీవుడ్ సినిమాలకు వెంటనే సైన్ లు చేయడం లేదు.దీంతో ఆ లోటును కొంతలో కొంత అర్జున్ తీర్చాలని డిసైడ్ అయ్యాడు.దానిలో భాగంగానే ఒక్కసారిగా రెండు ప్రతిష్టాత్మక చిత్రాలకు సైన్ లు చేయడం జరిగింది. మొత్తానికి యాక్షన్ కింగ్ అర్జున్ తెలుగు సినిమాలపై తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. మంచి పాత్ర దొరికితే.. ఆ పాత్రకు న్యాయం చేయాలని ఉవ్విళూరుతున్నాడు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: