బ్లాక్ డ్రెస్ లో కత్రినా పోజ్
కత్రినా ఇలా ఫోటో పోస్ట్ చేయగానే ఆమె అభిమానులు ఆ ఫోటోకు కామెంట్స్ వెల్లువను ప్రారంభించారు. "కత్రినా, యూ ఆర్ సో బ్యూటిఫుల్", "క్యాట్ లుకింగ్ గ్రేట్" అంటూ కామెంట్ చేస్తున్నారు. కత్రినా ఫోటోకు లైకులు కొడుగుతున్నారు. ఈ పిక్చర్ లో కత్రినా పెర్ఫెక్షన్ తో కెమెరాకు పోజ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. బ్లాక్ అత్లీజర్ లో గ్లామర్ తో పాటు ఎలిగెన్స్ ను కూడా కత్రినా ఒలకబోసింది. ఆమె తన ఉంగరాల జుట్టును అలా లూజ్ గా వదిలేసింది. మొత్తానికి ఈ ఫోటో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.
ఇక వర్క్ పరంగా, కత్రినా "ఫోన్ బూత్" అనే సినిమాలో నటిస్తోంది . ఇషాన్ ఖట్టర్ కు జోడీగా కనిపిస్తోంది. ఈ సినిమా సూపర్ నేచురల్ కామెడీ జోనర్ లో తెరకెక్కబోతోంది. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. గుర్మీత్ సింగ్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. "మీర్జాపూర్" ఫేమ్ ఈయనకు బాగానే ఉపయోగపడుతుందని చెప్పుకోవాలి. ఈ సినిమాను యాక్టర్ అలాగే ఫిలిం మేకర్ ఫర్హాన్ అక్తర్ అలాగే రితేష్ సిద్వానీ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
"ఫోన్ బూత్"కు సంబంధించిన ఫస్ట్ లుక్ ఆల్రెడీ ఆడియెన్స్ ను ఆశ్చర్యపరిచింది. కూల్ ఫోటో షూట్ లో కత్రినా, ఇషాన్ అలాగే సిద్ధార్థ్ పాల్గొన్నారు. లాక్ డౌన్ కంటే ముందే ఈ ఫస్ట్ లుక్ విడుదలైంది. అలాగే, కత్రినా రోహిత్ శెట్టి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న "సూర్యవంశీ"లో కూడా కనిపిస్తోంది.